Venkatesh’s Narappa Movie : కుటుంబ సమేతంగా ఉగాది శుభాకాంక్షలు తెలిపిన నారప్ప..

సీనియర్ హీరోల్లో కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు విక్టరీ  వెంకటేష్.  సోలో హీరోగా సినిమాలు చేస్తూనే.. అడపాదడపా యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్

Venkateshs Narappa Movie : కుటుంబ సమేతంగా ఉగాది శుభాకాంక్షలు తెలిపిన నారప్ప..
Narappa

Updated on: Apr 13, 2021 | 11:11 AM

Narappa Movie: సీనియర్ హీరోల్లో కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు విక్టరీ వెంకటేష్.  సోలో హీరోగా సినిమాలు చేస్తూనే.. అడపాదడపా యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం నారప్పగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వెంకీ. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగు లో రీమేక్ చేస్తున్నారు వెంకటేష్. అసురన్ సినిమాలో ధనుష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాదు ధనుష్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో నారప్పగా తీసుకురానున్నారు.

నారప్ప సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వెంకటేష్ మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణి నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ కోసం వెంకీ పూర్తిగా తన లుక్ ను మార్చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ వెంకటేష్ పంచెకట్టుతో అచ్చమైన పల్లెటూరి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కుటుంబ సమేతంగా ఎదో శుభకార్యానికి వెళుతున్నట్టుగా పోస్టర్ ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో నటుడు రాజీవ్ కనకాల కూడా ఉన్నారు. సురేష్ ప్రొడక్షన్ పై  వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

Vakeel Saab Movie: ఆ ప్రచారంలో వాస్తవం లేదు.. తేల్చి చెప్పిన ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్..

Dil Raju Corona Positive: కరోనా బారిన పడిన నిర్మాత దిల్ రాజు.. టెన్షన్ లో మెగాస్టార్ ‘అభిమానులు’

 

Loading...
Unable to load recommendations.
Follow Us