
RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యాంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటింస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. తారక్ కొమరం భీమ్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాను దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా. సముద్రఖని, అజయ్ దేవ్ గణ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.. పలువురు హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉన్నట్టు తెలుస్తుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 13 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ప్రతి వార్తా ఒక రేంజ్లో అభిమానులను అలరిస్తూ వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఉగాది పర్వదినం సందర్భంగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో చరణ్, తారక్ ఇద్దరు కనిపిస్తున్నారు. చరణ్ ను తారక్ ను ప్రజలు ఆకాశానికి ఎత్తుతూ సంబరాలు చేసుకుంటున్నట్టు డిజన్ చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ ను ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Vakeel Saab Movie: ఆ ప్రచారంలో వాస్తవం లేదు.. తేల్చి చెప్పిన ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్..
Dil Raju Corona Positive: కరోనా బారిన పడిన నిర్మాత దిల్ రాజు.. టెన్షన్ లో మెగాస్టార్ ‘అభిమానులు’