
యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. హిట్టు , ప్లాపులతో సంబంధం లేకుండా.. సందీప్ కిషన్ వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు. ఇటీవలే గల్లీ రౌడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్. ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇక అదే ఉత్సాహంతో మరో ప్రాజెక్టును ప్రారంభించాడు ఈ టాలెంటెడ్ హీరో. సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో.. విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఈరోజు హైదరాబాద్‌లో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు అల్లరి నరేష్, నాగశౌర్య ముఖ్య అతిథులుగా వచ్చారు.
అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇందులో కావ్య థాపర్, ఖుషీ రవి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా.. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీకి శేఖర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈరోజు ఈ సినిమాను పూజా కార్యక్రమాలను నిర్వహించి గ్రాండ్‌గా ప్రారంభించారు. సీనియర్ నిర్మాత జెమిని కిరణ్.. నిర్మాత సుధీర్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేయగా, హీరో అల్లరి నరేష్ ముహూర్తం షాట్ కోసం మొదటి క్లాప్ కొట్టారు. నాగ శౌర్య కెమెరా స్విచాన్ చేశారు. ఇక నంది దర్శకుడు విజయ్ కనకమేడల ముహూర్తం షాట్‌కి దర్శకత్వం వహించారు. అలాగే అగ్ర నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇక ఇందులో నటించే నటీనటుల గురించి పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
ట్వీట్..
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..