Kiran Abbavaram: ఇలా పరిచయం చేయాల్సి వస్తుందనుకోలేదు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన యంగ్ హీరో..

కిరణ్ అబ్బవరం.. సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. రాజావారు.. రాణీగారు సినిమాతో హీరోగా

Kiran Abbavaram: ఇలా పరిచయం చేయాల్సి వస్తుందనుకోలేదు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన యంగ్ హీరో..
Kiran Abbavaram

Updated on: Dec 03, 2021 | 3:38 PM

కిరణ్ అబ్బవరం.. సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. రాజావారు.. రాణీగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. ఇటీవల ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ముందుగా ఈ యంగ్ హీరో పలు షార్ట్ ఫిల్మ్స్ తో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారి మొదటి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇటీవల ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ కుర్రహీరోకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక హీరోగా నిలదొక్కుకుంటాడు అనుకుంటున్న సమయంలో కిరణ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

కిరణ్ అన్న రామాంజులు రెడ్డి డిసెంబర్ 1న ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాంజులు రెడ్డి మృతి చెందారు. దీంతో హీరో అబ్బవరం కిరణ్ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా తాజాగా తన సోదరుడిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు కిరణ్ అబ్బవరం. సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.

ఒరేయ్ కిరా .. మన ఊరికి సరిగ్గా రోడ్డు కూడా లేదురా. మన ఇద్దరిలో ఎవరో ఒకరం గట్టిగా సాధించాలిరా అని మా బ్రదర్ రామాంజులు రెడ్డి అనేవాడు. తనకి వీలైనదానికంటే ఎక్కువగానే నన్ను సపోర్ట్ చేశాడు. తన సరదాలను.. సంతోషాలను నా కోసం త్యాగం చేశాడు. ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నానని అనుకునేలోగా తను లేకుండా పోయాడు. అందరికీ నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావురా అని అప్పుడప్పుడు నన్ను అడిగేవాడు. ఏదైనా సాధించిన తరువాత పరిచయం చేద్దామని అనుకున్నాను. కానీ ఇలా చేయవలసి వస్తుందని అనుకోలేదు. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆనందం కోసం కష్టపడేవాళ్లు ఉంటారు.. అది మీరు పొందకుండా పోతే వాళ్లు తట్టుకోలేరు అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.. కిరణ్ రాసిన ఈ లేఖ అందరి చేత కంటతడి పెట్టిస్తుంది.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో అదిరిపోయే ట్విస్ట్ .. రీఎంట్రీ ఇవ్వనున్న రవి.. !!

Kalyani Priyadarshan: క్యూట్ బ్యూటీ ‘కళ్యాణి ప్రియదర్శన్’ ఆకట్టుకుంటున్న లేటేస్ట్ ఫోటోస్..

 

 

Follow Us