Naa Autograph: నా ఆటోగ్రాఫ్ మూవీ స్వీట్ మెమొరీస్.. అందాల లతిక (గోపిక)ఇప్పుడు ఎలా ఉందో.? ఎక్కడ ఉందో తెలుసా..

ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ అద్భుత నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో భూమిక, గోపిక, కనికా ముగ్గురు హీరోయిన్స్ గా నటించారు.

Naa Autograph: నా ఆటోగ్రాఫ్ మూవీ స్వీట్ మెమొరీస్.. అందాల లతిక (గోపిక)ఇప్పుడు ఎలా ఉందో.? ఎక్కడ ఉందో తెలుసా..
Naa Autograph

Updated on: Feb 09, 2023 | 11:43 AM

మాస్ మహారాజ్ రవితేజ కేవలం మాస్ మూవీలు మాత్రమే చేస్తాడు అనే వారికీ దిమ్మతిరిగేలా చేశారు రవితేజ. ఎమోషనల్ సీన్స్ లో తన టాలెంట్ అంతా చూపించారు. ఇంతకు ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా.? అదే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్. ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ అద్భుత నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో భూమిక, గోపిక, కనికా ముగ్గురు హీరోయిన్స్ గా నటించారు. 2004లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన వారిలో గోపిక గుర్తుందా.? ఆమె క్యారెక్టర్ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. మలయాళీ పాత్రలో చాలా సహజంగా నటించి అలరించారు గోపిక. అయితే ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారు.? ఎక్కడ ఉన్నారు.?

గోపిక పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి అలరించారు. యువసేన సినిమాలో గోపిక నటించి మెప్పించారు. గోపిక అసలు పేరు గ్లోరీ ఆంటో. గోపిక మలయాళంలో పలు సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె చివరిగా వీడు మామూలోడు కాదు అనే సినిమాలో నటించింది.

ఇక ఆమె 2013నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 17 జూలై 2008న, గోపిక ఉత్తర ఐర్లాండ్‌లో పనిచేస్తున్న డాక్టర్ అజిలేష్ చాకోను వివాహం చేసుకుంది . వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.ప్రస్తుతం వీరి కుటుంబం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు వెళ్లి అక్కడ స్థిరపడింది.GopikaGopika

Loading...
Unable to load recommendations.
Follow Us