Jagadeka Veerudu Athiloka Sundari : ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ మూవీ నిర్మాతల వార్నింగ్.. లీగల్ యాక్షన్ అంటూ..

|

Oct 10, 2023 | 8:48 PM

ఈ సినిమాలో చిరు సరసన దివంగత నటి శ్రీదేవి కథానాయికగా నటించింది. ఈ సోషియో ఫాంటసీ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మించింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను కట్టిపడేస్తాయి. అలాగే ఈ చిత్రంలోని కామెడీ డైలాగ్స్ ఎంత ఫేమస్ అయ్యాయో చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఈ సినిమా పేరు ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ఈ సినిమా గురించి వైజయంతి నిర్మాతలు ఓ వార్నింగ్ నోట్ రిలీజ్ చేశారు.

Jagadeka Veerudu Athiloka Sundari : జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ నిర్మాతల వార్నింగ్.. లీగల్ యాక్షన్ అంటూ..
Jagadeka Veerudu Athiloka S
Follow us on

మెగాస్టార్ చిరంజీవి కెరియర్‏లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి. డైరెక్టర్ కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరు సరసన దివంగత నటి శ్రీదేవి కథానాయికగా నటించింది. ఈ సోషియో ఫాంటసీ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మించింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను కట్టిపడేస్తాయి. అలాగే ఈ చిత్రంలోని కామెడీ డైలాగ్స్ ఎంత ఫేమస్ అయ్యాయో చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఈ సినిమా పేరు ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ఈ సినిమా గురించి వైజయంతి నిర్మాతలు ఓ వార్నింగ్ నోట్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కాపీ రైట్స్ తమకే సొంతమని.. ఇతరులు వాడుకుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు ఆ నోట్ నెట్టింట వైరలవుతుంది.

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని స్టోరీ, కాన్సెప్ట్, పాత్రలు ఇలా దేని గురించి అయిన తమ ప్రమేయం లేకుండా ఉపయోగించడానికి వీల్లేదని.. ఒకవేళ అతిక్రమిస్తే లీగల్ చర్యలు తప్పవని చెబుతూ ఆ నోట్ షేర్ చేశారు. అయితే ఉన్నేట్లుండి వైజయంతీ మేకర్స్ ఇలా వార్నింగ్ నోట్ షేర్ చేయడానికి గల కారణమేంటీ ? అని ఆరా తీస్తున్నారు నెటిజన్స్. మొన్నటి వరకు కల్కి సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ ఉండకూడదని.. లీక్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇక ఇప్పుడు ఆకస్మాత్తుగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా గురించి చెబుతూ సీరియస్ నోట్ రిలీజ్ చేశారంటే చిరు 157 చిత్రాన్ని ఉద్దేశిస్తూ పరొక్షంగా ఈ నోటీస్ షేర్ చేశారా ?.. అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఎందుకంటే.. ప్రస్తుతం చిరు తన 157 సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు ముల్లోకవీరుడు అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నారని.. ఈ సినిమా స్టోరీ ప్రకారం హీరో మరో లోకంలోకి వెళ్లి అక్కడ ఉండే దేవకన్యలను కలుస్తారని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా సైతం గతంలో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాను పోలీ ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో వైజయంతి మేకర్స్ ఈ నోటీస్ షేర్ చేశారంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.