Vishal Health update: అందుకే విశాల్ స్టేజ్ పై స్పృహ తప్పి పడిపోయాడు.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్

ఆదివారం (మే 11) రాత్రి ట్రాన్స్‌జెండర్ 2025 అందాల పోటీలు జరిగాయి. చిత్తిరై వేడుకల్లో భాగంగా ట్రాన్స్‌జెండర్లకు నిర్వహించిన ‘మిస్‌ కూవాగం 2025’ అందాల పోటీలకు ముఖ్యఅతిథిగా హీరో విశాల్‌ హాజరయ్యారు. ఇందులో భాగంగా విశాల్‌ వేదికపై ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. దాంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.

Vishal Health update: అందుకే విశాల్ స్టేజ్ పై స్పృహ తప్పి పడిపోయాడు.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్
Vishal

Updated on: May 12, 2025 | 7:05 AM

యాక్షన్ హీరో విశాల్ కు అసలు ఏమైంది.. విశాల్ పేరు ఎప్పుడూ వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ స్టార్ హీరో ఎక్కువగా షూటింగ్స్ లో గాయపడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇప్పటికే పలు సార్లు విశాల్ షూటింగ్ లో గాయపడ్డాడు. అంతే కాదు విశాల్ ఆరోగ్యం పై కూడా ఇండస్ట్రీలో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా విశాల్ ఓ కార్యక్రమంలో స్పృహ తప్పి పడిపోయాడు. విశాల్ విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సమయంలో వేదికపై అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి పడిపోయారు. ఈ ఘటన మే 11, 2025న మిస్ కువాగం ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కాంటెస్ట్ సందర్భంగా జరిగింది. విశాల్ స్పృహ తప్పడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఆయన కోలుకున్నారు. తమిళ మీడియా ప్రకారం, ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల ఈ ఘటన జరిగి ఉండవచ్చని, అరగంట విశ్రాంతి తర్వాత విశాల్ మళ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారని అంటున్నారు.

అయితే విశాల్ ఆరోగ్యం పై మేనేజర్ హరి క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్యాహ్నం విశాల్ ఆహారం తీసుకోలేదని, జ్యూస్ మాత్రమే తాగాడని, అందుకే ఆయన స్పృహ కోల్పోయానని హరి తెలిపాడు. స్పృహ కోల్పోన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారని . వైద్యులు ఆయనను పరీక్షించి ఆయన క్షేమంగా ఉన్నారని, సమయానికి ఆహారం తీసుకోవడం మానేయవద్దని సూచించారని. విశాల్ క్షేమంగా ఉన్నాడని తెలిపారు మేనేజర్.

గతంలోనూ ఓ ఈవెంట్ లో విశాల్ అనారోగ్యంగా కనిపించారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయి. స్టేజ్ పై మైక్ పట్టుకొని వణుకుతూ కనిపించారు. దాంతో ఆయన అభిమానులు ఆందోళన పడ్డారు. అయిత్ ఆ సమయంలో విశాల్ తీవ్ర జ్వరంతో ఉన్నాడని.. అందువల్లే ఆయన అలా నీరసంగా వణుకుతూ కనిపించారని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us