
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కొరియన్ కనకరాజు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఇప్పుడు ఎట్టకేలకు ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. అయితే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ సమయంలో చేతిలో సాయంగా స్టిక్ పట్టుకుని నడుస్తూ కనిపించారు వరుణ్ తేజ్. దీంతో షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో కాలికి గాయమైందని వెల్లడించారు. గత మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు వరుణ్. కానీ ఇప్పుడు తన కొత్త సినిమా కొరియన్ కనకరాజు ప్రచార కార్యక్రమాల్లో మాత్రం స్టిక్ పట్టుకుని మెల్లిగా నడుస్తూ ప్రమోషన్స్ చేస్తున్నాడు.
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..
ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన కొరియన్ కనకరాజు ట్రైలర్ లాంచ్ వేడుకకు సైతం స్టిక్ పట్టుకుని మెల్లిగా నడుస్తూ వచ్చాడు వరుణ్ తేజ్. తన కాలి గాయం ఎలా ఉందంటూ మీడియా అడగడంతో.. వరుణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పర్వాలేదని.. ఇంకా తాను పూర్తిగా కోలుకోవడానికి దాదాపు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని అన్నారు. తాను కోలుకున్న తర్వాతే నెక్ట్స్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని అన్నారు. దీంతో వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
ఇక కొరియన్ కనకరాజు సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో రితిక నాయక్ కథానాయికగా నటిస్తుంది. ఇందులో సత్య, డీజీ టిల్లు ఫేమ్ మురళీధర్, చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 7న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
ఎక్కువమంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..