వివాహం తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి దంపతులు మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజిబిజీగా మారిపోయారు. సినిమాలపై పూర్తి దృష్టి సారించారు. ఇటీవలే మిస్ పర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్‌తో అభిమానులను పలకరించింది లావణ్య. ఇప్పుడు వరుణ్ కూడా కొత్త సినిమాతో మన ముందుకు రానున్నాడు. మెగా ప్రిన్స్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ మార్చి 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. శక్తి ప్రతాప్ తెరకెక్కించిన ఈ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ కాన్సెప్ట్ మూవీలో మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ మెగా మూవీ రిలీజ్ కానుండడంతో వరుణ్ తేజ్ స్వయంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ తన సినిమాను జనాల్లోకి తీసుకెళుతున్నాడు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్, లావణ్య దంపతులు తాజాగా గోదారమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఇద్దరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు వరుణ్. ఈ ఫొటోలో పూజారులు, వరుణ్ మాత్రమే ఉన్నారు. లావణ్య కనిపించలేదు. అయితే మెగా కోడలు గోదావరిలో పడవ ఫొటోను నెట్టింట పంచుకుంది. దీంతో వారిద్దరూ కలిసే గోదావరి తల్లికి పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వరుణ్, లావణ్యల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ మెగా దంపతులు ఎందుకు పూజలు చేస్తున్నారబ్బా? అంటూ అభిమానులు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. అయితే వరుణ్ నటించిన గత సినిమాలు పూర్తిగా నిరాశపర్చాయి. ఆపరేషన్ వాలంటైన్ విజయం సాధించాలని మళ్లీ తనకు గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ భార్యతో కలిసి ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇవాళ (ఫిబ్రవరి25) సాయంత్రం 6 గంటలకు ఆపరేషన్ వాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ వేదికగా జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారు.జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈ వేడుక జరగనుంది.
Super excited to have Megastar Chiranjeevi garu as the chief guest for #OperationValentine pre-release event!
🫡thanks boss!🔥 pic.twitter.com/F31dyuLi8L— Varun Tej Konidela (@IAmVarunTej) February 24, 2024
At the Pulwama memorial site in Lethpora Camp!🙏
With deepest respect and gratitude, we honour the memory of the bravehearts who laid down their lives in the Pulwama attack💔
Their supreme sacrifice will always be remembered #JaiHind 🇮🇳 pic.twitter.com/2gbmXIAwqm
— Varun Tej Konidela (@IAmVarunTej) February 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.