
Vakeel Saab Release Date Announced: పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. పవన్ కొత్త చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్రయూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత సినిమాలు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో బిజీగా మారారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దీంతో పవన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
అయితే తమ అభిమానుల్లో జోష్ నింపుతూ కొత్త సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు పవన్. ఒకటి, రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను ఒకేసారి ప్రకటించి గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులో భాగంగా తెరకెక్కుతోన్న సినిమాల్లో ‘వకీల్ సాబ్’ ఒకటి. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెలుగులో నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్సన్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా వకీల్ సాబ్ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఓవైపు అన్నయ్య చిరంజీవి మే13న ‘ఆచార్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ అంతకంటే ముందే ఏప్రిల్ 9న అభిమానులను అలరించడానికి వస్తున్నాడు. వకీల్ సాబ్ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్9న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోతోంది. ఈ సినిమాలో పవన్ లాయర్‌గా కనిపిస్తుండగా.. శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: Niharika: వేసవి త్వరగా రావాలని కోరుకుంటున్న మెగా డాటర్ నిహారిక.. కారణమేంటో తెలుసా..?