Uppena Vaishnav Tej: మెగా హీరో సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్న నాగార్జున.. నూతన దర్శకుడితో…

|

Feb 27, 2021 | 1:44 PM

Uppena Vaishnav Tej New Movie: 'ఉప్పెన' చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌. మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్ లైన్‌ ఉన్నప్పటికీ ఈ సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను...

Uppena Vaishnav Tej: మెగా హీరో సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్న నాగార్జున.. నూతన దర్శకుడితో...
Follow us on

Uppena Vaishnav Tej New Movie: ‘ఉప్పెన’ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌. మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్ లైన్‌ ఉన్నప్పటికీ ఈ సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడీ హీరో. తొలి సినిమానే అయినప్పటికీ సహజ నటనతో సినిమా విషయంలో కీలకపోత్ర పోషించాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా విజయంతో వైష్ణవ్‌ చుట్టూ దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ యంగ్‌ హీరోతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వైష్ణవ్‌ ఇప్పటికే పలు సినిమాలను ఓకే కూడా చేశాడు. ఇక క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కికన సినిమా ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉంది. కొండపాలం అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదలవక ముందే వైష్ణవ్‌ కొన్ని సినిమాలకు సైన్‌ చేసిటనట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్‌ ఓ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘మనం ఎంటర్‌టైన్‌ మెంట్స్‌’ బ్యానర్‌పై ఈ సినిమాను నాగార్జున నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా నాగార్జున మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడని సమాచారం. ఇక ఉప్పెన సినిమాకు దర్శకత్వం వహించిన బుచ్చిబాబుకు కూడా అదే తొలి సినిమా అనే విషయం తెలిసిందే. మరి అక్కినేని వారి నిర్మాణంలో మెగా వారి అబ్బాయి నటించబోయే ఈ సినిమా ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. వైష్ణవ్‌ తేజ్‌ నిర్మాత భోగవల్లి ప్రసాద్‌తో కూడా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా నూతన దర్శకుడే తెరకెక్కిస్తుండడం విశేషం.

Also Read: Priya Prakash Varrier : కన్ను గీటి కుర్రాళ్లందరినీ తన మత్తులో పడేసి.. తాను మాత్రం ఇలా పడిందేంటి..!

Naandhi movie : బ్రేక్ ఈవెన్ దాటి దూసుకుపోతున్న నరేష్ ‘నాంది’.. ఏడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..