
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సినిమా ఏ రెంజ్ ఉండబోతుందో హింట్ చెప్పేశారు మేకర్స్. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఓ వైపు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. కళావతి, పెన్నీ, మ.. మ.. మహేశ్ పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే విడుదలకు ముందే సర్కారు వారి పాట రికార్డుల వేట మొదలుపెట్టింది. ఇప్పటికే దాదాపు హైదరాబాద్‌లో అన్ని షోలు బుక్ అయిపోయాయి. నైజాం.. తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
ఇప్పటికే ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యుడు.. సినీ విశ్లేషకుడు ఉమర్ సంధు సర్కారు వారి పాట రివ్యూను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.. ” మహేష్ బాబు ఈ సినిమాలో క్రూర సింహంలా కనిపించాడు.. అతని నటన.. కోపాన్ని ప్రదర్శించిన తీరు ప్రతిసారి స్క్రీన్ బర్న్ చేశాడు.. సర్కారు వారి పాట చిత్రానికి మహేష్ శక్తిని అందించాడు. ” అంటూ చెప్పుకొచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించన ఈ మూవీలో సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో నటించగా.. తమన్ మ్యూజిక్ అందించారు. ఇందులో మహేష్ మరింత హ్యండ్సమ్.. స్టైలీష్ లుక్కులో కనిపించనున్నాడు..
ట్వీట్..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Mahesh Babu: ఆ మ్యాగజైన్‌కు థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఆ అనుభవం చాలా సరదాగా ఉందంటూ కామెంట్..
Sarkaru Vaari Paata: త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా జోనర్ అలాంటిదే.. మహేష్ బాబు కామెంట్స్..