విజయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన త్రిష.. బర్త్‌డే విషెస్ కూడా లేవ్! నెట్టింట జోరు చర్చ

Trisha Unfollows Vijay: నటి త్రిష- సీఎం విజయ్ సంబంధంపై ఇప్పటికే పలు రూమర్లు వినిపిస్తున్న వేళ, త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను అన్‌ఫాలో చేసినట్లు అభిమానులు గుర్తించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. గతంలో ప్రతి ఏడాది విజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టులు చేసిన త్రిష, ఈసారి మౌనం పాటించడం చర్చనీయాంశంగా మారింది..

విజయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన త్రిష.. బర్త్‌డే విషెస్ కూడా లేవ్! నెట్టింట జోరు చర్చ
Trisha Vijay Relationship

Updated on: Jun 23, 2026 | 12:18 PM

సినీ హీరో విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత తళినాట రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దీనితోపాటు గత కొన్ని నెలలుగా నటి త్రిష కృష్ణన్ పేరుతోపాటు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్‌ పేరుతో కలిపి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ మీడియా సైతం వేడి వేడి వార్తలు వండి వడ్డించింది. Ghilli, Leo, GOAT వంటి హిట్ చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారనే వార్తల నేపథ్యంలో విజయ్-త్రిషల మధ్య సంబంధంపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ విషయంపై ఇద్దరూ ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ – త్రిష వీరిద్దరూ విడిపోయారంటూ నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందుకు కారణం తాజాగా విజయ్‌ను సోషల్ మీడియాలో త్రిష అన్‌ఫాలో చేయడమే కారణం. ఈ ఏడాది జూన్‌ 22న విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కానీ త్రిష మాత్రం విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేయకపోవడం ఈ రెండు ఘటనలు వెనువెంటనే జరిగాయి. విజయ్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఇది తొలి పుట్టిన రోజు కావడంతో త్రిష విషెస్‌ కోసం సర్వత్రా ఎదురు చూశారు. గత కొన్నేళ్లుగా త్రిష, విజయ్‌తో కలిసి తీసుకున్న అరుదైన ఫొటోలను పంచుకుంటూ, హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చింది. అయితే ఈసారి ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు చేయకపోవడంతో అభిమానుల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. అంతేకాక ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విజయ్‌ను అన్‌ఫాలో చేసిన విషయాన్ని కూడా అభిమానులు గమనించడం.. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయా అనే ఊహాగానాలకు ఆజ్యం పెసినట్లైంది.

ఇక సినిమా విషయాలకొస్తే.. త్రిష ఇటీవల సూర్య సరసన నటించిన Karuppu చిత్రంలో కనిపించింది. RJ Balaji దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమాలో దర్శకుడు ఆర్జే బాలాజీ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. మరోవైపు రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన విజయ్ చాలా కాలంగా వాయిదా పడుతున్న తన చివరి చిత్రం జన నాయగన్‌ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. H. Vinoth దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం గత ఏడాది డిసెంబర్ నుంచి పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇంకా ఈ సినిమాకు CBFC నుంచి సెన్సార్ సర్టిఫికెట్ కూడా లభించకపోవడం విశేషం.

Follow Us