AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha Krishnan : ఇదేందయ్య ఇది.. విజయ్‏తో బ్రేకప్ అంటూ రూమర్స్.. ఖతర్నాక్ ట్విస్ట్ ఇచ్చిన త్రిష..

విజయ్ దళపతి, త్రిష గురించి నెట్టింట అనేక వార్తలు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు విజయ్ విడాకుల విషయం సైతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. జూన్ 22న విజయ్ పుట్టినరోజు కావడంతో త్రిష నుంచి ఎలాంటి విషెస్ కానీ.. పోస్ట్ రాలేదు. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈక్రమంలో అసలైన ట్విస్ట్ ఇస్తూ కొత్త పోస్ట్ చేసింది త్రిష. ఇంతకీ త్రిష ఏం పోస్ట్ చేసిందో తెలుసా..

Trisha Krishnan : ఇదేందయ్య ఇది.. విజయ్‏తో బ్రేకప్ అంటూ రూమర్స్.. ఖతర్నాక్ ట్విస్ట్ ఇచ్చిన త్రిష..
Trisha, Vijay
Rajitha Chanti
|

Updated on: Jun 23, 2026 | 8:39 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిషల మధ్య ఉన్న బాండింగ్ గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త చెక్కర్లు కొడుతూనే ఉంటుంది. గతంలో కేవలం రూమర్స్ గా మాత్రమే ప్రచారంలో ఉన్న వీరి రిలేషన్.. ఇటీవల విజయ్ తన భార్యతో విడాకుల ప్రక్రియ, ఆ తర్వాత త్రిషతో కలిసి తరచూ కనిపించడం, విజయ్ కుటుంబ సభ్యులతో త్రిష సన్నిహితంగా ఉండటంతో వీరిద్దరి రిలేషన్ నిజమేనని అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే, తాజాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. విజయ్ బర్త్ డే రోజున త్రిష సోషల్ మీడియాలో ఎలాంటి శుభాకాంక్షలు చెప్పకపోవడం, పైగా అతడిని అన్‌ఫాలో చేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వీరిద్దరూ అప్పుడే విడిపోయారా? , నిజంగానే బ్రేకప్ జరిగిందా అంటూ రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

కానీ, ఈ పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ త్రిష ఇన్ స్టాగ్రామ్‌ లో ఒక ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. విజయ్ పుట్టినరోజును అర్ధరాత్రి తానే స్వయంగా దగ్గరుండి సెలబ్రేట్ చేసిన ఒక స్పెషల్ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో విజయ్, త్రిషల ముందు ఒక బర్త్ డే కేక్ కూడా ఉంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ.. “జీవితంలో ప్రతిదానికి ఒక విలువను చేకూర్చే వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ఎమోషనల్ క్యాప్షన్ జోడించింది త్రిష. అంతేకాదు, ఈ సెలబ్రేషన్స్ అర్ధరాత్రి 12 గంటలకే జరిగాయని హింట్ ఇస్తూ “00.00” అని కూడా మెన్షన్ చేసింది. ఇక ఇప్పుడు త్రిష షేర్ చేసిన ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

ఈ అర్ధరాత్రి బర్త్ డే సెలబ్రేషన్ ఫొటో సోషల్ మీడియాలోకి రావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. తాము విడిపోయామంటూ వచ్చిన పుకార్లకు త్రిష ఈ ఒక్క ఫొటోతో గట్టి సమాధానం చెప్పిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్పెషల్ పిక్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో ఉన్న వెబ్ సిరీస్..

త్రిష ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..

Follow Us