Konda Movie: కొండా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ప్రముఖ రాజకీయ నాయకుడు.. ఆర్జీవీ పిలిచిన ఆ అతిథి ఎవరంటే..

Konda Movie: నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కిచండంతో తనకు తానే సాటి దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. సమాజంలో జరిగే అంశాలను తన సినిమా కథాంశంగా ఎంచుకొని..

Konda Movie: కొండా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ప్రముఖ రాజకీయ నాయకుడు.. ఆర్జీవీ పిలిచిన ఆ అతిథి ఎవరంటే..
Rgv Konda Movie

Updated on: Jun 16, 2022 | 7:36 PM

Konda Movie: నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కిచండంతో తనకు తానే సాటి దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. సమాజంలో జరిగే అంశాలను తన సినిమా కథాంశంగా ఎంచుకొని ఎప్పుడూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉండే వర్మ తాజాగా మరో సంచలన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. కొండా మురళి, కొండా సురేఖల జీవిత కథతో ‘కొండా’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నక్సలిజం, రాజకీయ బ్యాగ్‌డ్రాప్‌ నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించ విడుదలైన టీజర్లు, ట్రైలర్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్‌ 23న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ నెల 18న వరంగల్‌లో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. వరంగల్‌లోని ఖుష్‌ మహల్‌ గ్రౌండ్‌లో ఈవెంట్‌ సాయంత్రం 6.30 గంటలకు వేడుక ప్రారంభంకానుంది.

ఇదిలా ఉంటే ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ విషయాన్ని వర్మ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వస్తున్న తన మిత్రుడు, తెలంగాణ సింహం రేవంత్ రెడ్డికి ‘కొండా’ సినిమా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ రాసుకొచ్చారు వర్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us