NTR: ఇటలీ నుంచి కొత్త కారును దిగుమతి చేసుకుంటున్న ఎన్టీఆర్‌.? ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

|

Mar 03, 2021 | 9:03 AM

NTR Buys 5 Crore Worth Car: ఖరీదైన కార్లను కలెక్ట్‌ చేయడం సెలబ్రిటీలకు ఒక హాబీగా ఉంటుంది. ఇందుకోసం రూ. కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు చాలా మంది హీరోలు, క్రికెటర్లు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ..

NTR: ఇటలీ నుంచి కొత్త కారును దిగుమతి చేసుకుంటున్న ఎన్టీఆర్‌.? ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Follow us on

NTR Buys 5 Crore Worth Car: ఖరీదైన కార్లను కలెక్ట్‌ చేయడం సెలబ్రిటీలకు ఒక హాబీగా ఉంటుంది. ఇందుకోసం రూ. కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు చాలా మంది హీరోలు, క్రికెటర్లు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ వాహనాలపై తమకున్న మక్కువను ప్రపంచానికి చాటుచెబుతున్నారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కార్లపై ఎక్కువగా మక్కువ చూపే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజాగా తన కార్ల కలెక్షన్లలో మరో కాస్లీ కారును చేర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ఏకంగా రూ.5 కోట్ల విలువ చేసే కారును బుక్‌ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ కారు ఇండియాలో తయారైంది కాదు ఇటలీలో. ఎన్టీఆర్‌ కోసం ఈ కారు ఇటలీ నుంచి ప్రత్యేకంగా భారత్‌కు రానుందన్నమాట. లాంబోర్గిని కంపెనీకి చెందిన ‘ఉరుస్‌’ కారును ఎన్టీఆర్‌ ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశాడని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ కారు భారత్‌ చేరుకోనున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా లాంబోర్గిని కారుకు ఎంతో క్రేజ్‌ ఉంది. అత్యంత కాస్లీ, లగ్జరీ కార్ల వరుసలో లాంబోర్గి మొదటి వరుసలో ఉంటుంది. ఇదిలా ఉంటే సౌత్‌ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఈ కారును బుక్‌ చేసుకున్న తొలి నటుడిగా ఎన్టీఆర్‌ చరిత్ర సృష్టించనున్నాడు. ఇక ఈ కారు ప్రత్యేకతల విషయానికొస్తే.. ట్విన్‌ టర్బో V8 ఇంజిన్‌తో ఉండే ఈ కారు 650 CV ప్రొడ్యుస్‌ చేస్తుంది. కేవలం 3.6 సెకండ్లలో 62 గంటకు 62 కీలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ కారు ప్రత్యేకత.
ఇక ఎన్టీర్‌ సినీ కెరీర్‌ విషయానికొస్తే.. జూనియర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి ఓ సినిమా చేయనున్నాడు.

 

 

Also Read: Drishyam 2 movie : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా విక్టరీ హీరో.. ‘దృశ్యం 2’ కి కొబ్బరికాయ కొట్టిన వెంకీమామ..

athi Ratnalu movie : పాన్ ఇండియా స్టార్ చేతులమీదుగా విడుదల కానున్న జాతిరత్నాలు ట్రైలర్..

Keerthy Suresh : టాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో తక్కువ టైంలో టాప్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దూసుకుపోతున్న మహానటి.