Tollywood: టాలీవుడ్‌లో విషాదం.. కుందనపు బొమ్మ మూవీ హీరో ఆత్మహత్య

టాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఇతడు కుందనపు బొమ్మ సినిమాలో ఒక హీరోగా చేశాడు.

Tollywood: టాలీవుడ్‌లో విషాదం.. కుందనపు బొమ్మ మూవీ హీరో ఆత్మహత్య
Hero Sudheer

Updated on: Jan 23, 2023 | 2:31 PM

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ యువనటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సుధాకర్ కోమాకుల, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన కుందనపు బొమ్మ అనే సినిమాలో సుధీర్ అనే యువ నటుడు కూడా కీలక పాత్ర పోషించాడు. తాజాగా అతడు వైజాగ్‌లో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అవకాశాలు రాక  జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడా.. పర్సనల్ రీజన్స్ వల్లన అన్నది తేలాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. సుధీర్ ఆత్మహత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు నటుడు సుధాకర్. అతడు లేడన్న విషయాన్ని జీర్ణించులేకపోతున్నానని ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్ పెట్టాడు. యువ నటుడు మరణంపై పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..