Tollywood Heroines: సన్నజాజిలా మారాలన్న కసి.. జిమ్ లో కసరత్తులతో కష్టపడుతున్న వయ్యారి భామలు…

హీరోయిన్‌లు ఒకప్పుడు ఫిట్‌నెస్‌కు అంతగా ప్రాధాన్యం ఇచ్చే వారు కాదు.. కాస్త బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటామని అనుకునేవారు.

Tollywood Heroines: సన్నజాజిలా మారాలన్న కసి.. జిమ్ లో కసరత్తులతో కష్టపడుతున్న వయ్యారి భామలు...

Updated on: May 14, 2021 | 11:35 PM

Tollywood Heroines: హీరోయిన్‌లు ఒకప్పుడు ఫిట్‌నెస్‌కు అంతగా ప్రాధాన్యం ఇచ్చే వారు కాదు.. కాస్త బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటామని అనుకునేవారు. కానీ ఇప్పటి హీరోయిన్‌లు మాత్రం అలా కాదు. జిమ్‌లలో తెగ కష్ట పడుతూ.. సన్నగా సెక్సీలుక్‌లోకి మారిపోతున్నారు. ఫిట్గా.. పిచ్చ హాట్‌గా ఉంటూ.. ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అలా దూసుకుపోతున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు.. సమంత, పూజా హెగ్డే, రష్మిక, రాశీ ఖన్నా, రకుల్.

సినిమాలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. కసరత్తులను మాత్రం వదిలేది లేదంటారు ఈ భామలు. తీరిక దొరికినా దొరకకున్నా.. జిమ్‌లో ఓ రెండు గంటలు మాత్రం తెగ కష్టపడుతుంటారు. చిక్కి చక్కగా కనిపించాల్సిందేనంటూ.. గట్టిగా తీర్మానించుకుంటారు కూడా..!

కష్టమైన ఎక్సర్‌సైజులను చేస్తూ.. బరువులను మోస్తూ.. మరింత ఫిట్‌గా.. కనిపించడమే లక్ష్యం అని చెబుతుంటారు. చక్కని శరీరాకృతితో స్టార్‌ హాదాలో వెలుగొందాలని కోరుకొంటుంటారు.

 

అలా కష్ట పడడమే కాదు.. ఆ కష్టాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో తమ అభిమానుల కోసం షేర్ చేస్తుంటారు. జీవితంలో అందంగా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమంటూ.. అందరికీ చెబుతుంటారు.

Loading...
Unable to load recommendations.
Follow Us