స్టార్ క్రికెటర్ పై మనసు పడ్డ టాలీవుడ్ హీరోయిన్.. డేటింగ్ చేస్తా అని ఓపెన్‌గా చెప్పిన బ్యూటీ

ఈ మధ్యకాలంలో చాలా మంది ముద్దుగుమ్మలు ఓపెన్ కామెంట్స్ తో తెగ వైరల్ అవుతున్నారు. అలానే ఇప్పుడు ఓ చిన్నది చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఓ యంగ్ క్రికెటర్ తో డేటింగ్ చేయాలనీ ఉంది అంటూ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యింది ఆ చిన్నది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..

స్టార్ క్రికెటర్ పై మనసు పడ్డ టాలీవుడ్ హీరోయిన్.. డేటింగ్ చేస్తా అని ఓపెన్‌గా చెప్పిన బ్యూటీ
Tollywood Actress

Updated on: Jun 14, 2025 | 9:14 AM

అందం, అభినయం ఉన్న అవకాశాలు లేక ఎదురుచూస్తున్న భామల్లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతోనే కాదు గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకొని ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందికుంటున్నా కూడా స్టార్ డమ్ మాత్రం ఈ అమ్మడుకి అందని ద్రాక్ష గా మారింది. రీసెంట్ గా ఈ చిన్నది చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేయాలనీ ఉంది అంటూ చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భామల్లోప్రగ్యా జైస్వాల్ ఒకరు.

డేగ అనే సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది ఈ బ్యూటీ. మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది. కంచె సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినా కూడా అంతగా పాపులర్ అవ్వలేకపోయింది. సినిమాలతో పాటు చాలా యాడ్స్ లోనూ నటించింది.

ఇక ఈ ముద్దుగుమ్మ అఖండ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ గానే కాదు సెకండ్ హీరోయిన్ గానూ ఈ అమ్మడు ఆకట్టుకుంది. తన అందం అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా ప్రగ్యా జైస్వాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓ స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా..? యంగ్ క్రికెటర్ శుభమాన్ గిల్. శుభ్‌మాన్‌తో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది. గతంలో సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో శుభ్‌మన్ డేటింగ్ చేస్తున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. ఈ జంట తరచూ మీడియా కంట పడుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.