
బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది నటి మిర్చి మాధవి. అటు సినిమాల్లోనూ కీలకపాత్రలు పోషించి ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం వరుస సినిమాలు, సీరియల్స్ ద్వారా బిజీగా ఉన్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా ఒక సినిమాలో నటించే అవకాశం కోసం ఐదుగురికి “కమిట్మెంట్” ఇవ్వాలని అడిగిన సంఘటనపై ఆమె స్పందించారు. ఈ ఘటన ప్రకాష్ రాజ్ సినిమాకు సంబంధించినది కాదని, ఆయన కూడా ఆ చిత్రంలో ఒక భాగం మాత్రమేనని మాధవి వివరించారు. ఈ సంఘటన 13 ఏళ్ల క్రితం జరిగిందని, అది ఒక్కసారి మాత్రమే ఎదురైందని, ఆ తర్వాత అటువంటి కాల్స్ మళ్లీ రాలేదని ఆమె స్పష్టం చేశారు. “మిర్చి” సినిమా చేయడానికి ముందే ఈ సంఘటన జరిగిందని ఆమె తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు.. జగపతి బాబు..
సినీ పరిశ్రమలో సవాళ్లు ఉంటాయని అంగీకరిస్తూ, “కాల్స్ వస్తాయి, బురద ఉంటుంది, మురికి ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, చెత్త ఉంటుంది. అన్ని తోసుకుంటూ ముందుకు వెళ్లాలి. నువ్వు ధైర్యంగా నీ జర్నీ చూసుకోవాలి” అని ఆమె సూచించారు. అటువంటి సందర్భాలను ఎలా ఎదుర్కోవాలో మహిళలు నిర్ణయించుకోవాలని, అవసరమైతే మా అసోసియేషన్ వంటి వాటికి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. అయినప్పటికీ, తాను ఎప్పుడూ ఫిర్యాదులు చేయలేదని, ఎందుకంటే ఎవరు వింటారు లేదా ఎవరు సరిచేస్తారు అనే సందేహం తనకు ఉందని ఆమె పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..
పరిశ్రమ పట్ల తన నిబద్ధత గురించి మాట్లాడుతూ, ఇది తనకెంతో ఇష్టమైన వృత్తి అని, కానీ దాన్ని సర్వస్వంగా భావించలేనని మాధవి తెలిపారు. తన తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేసినట్లుగానే, ఇండస్ట్రీని కూడా తాను ఒక ఉద్యోగంగానే చూస్తున్నానని చెప్పారు. తనకు మంచి పాత్రలు రావడం లేదని అంగీకరించినప్పటికీ, బయటికెళ్లి మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టడం సాధ్యం కాదని, తనకున్న అనుభవాన్ని, నటన నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు సాగాలనుకుంటున్నానని ఆమె అన్నారు. పెద్ద పాత్రలు, టైటిల్ కార్డ్ రోల్స్ కావాలని ప్రతి కళాకారుడికి ఉన్నట్లే, తనకు కూడా ఉంటుందని, అయితే అక్కడిదాకా చేరుకోవడం ఒక సుదీర్ఘ ప్రయాణమని ఆమె అన్నారు. తనకు కొన్ని విషయాలపై నిరాశ ఉన్నప్పటికీ, పరిశ్రమపై ఆసక్తి లేదని మాత్రం చెప్పలేనని మాధవి పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..
Mirchi Madhavi News
ఎక్కువ మంది చదివినవి : Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..