
ది కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్ సుధీప్తో సేన్, హీరోయిన్ ఆదా శర్మ యాక్సిడెంట్‌కు గురయ్యారు. ముంబయిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతుండగా వీరు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు సాయంత్రం కరీంనగర్ లో జరిగే హిందూ ఏక్తాయాత్రకు హాజరుకాలేకపోవడం బాధగా ఉందని పేర్కొంటూ డైరెక్టర్ సుదీప్తో సేన్ ట్వీట్ చేశారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.