Actor Sanjosh: యంగ్ హీరో మంచి మనసు.. పేద విద్యార్థుల కోసం ఏం చేశారో తెలిస్తే ఫిదా కావాల్సిందే..

ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు కుర్ర హీరోలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో సంజోష్ ఒకరు. బేవార్స్ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయం ఈ యంగ్ హీరో రీల్ మీదనే కాకుండా రియల్ లైఫ్ లోనూ తన మంచి మనసు చాటుకుంటున్నాడు. తాజాగా ఈ హీరో చేసిన పని తెలిస్తే ఫిదా కావాల్సిందే.

Actor Sanjosh: యంగ్ హీరో మంచి మనసు.. పేద విద్యార్థుల కోసం ఏం చేశారో తెలిస్తే ఫిదా కావాల్సిందే..
Sanjosh

Updated on: May 18, 2026 | 9:36 PM

సినిమాల్లో రాణించడమే కాకుండా సమాజ సేవలోనూ తనదైన ముద్ర వేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు యువ నటుడు సంజోష్. ‘బేవార్స్’, ‘సోదరా’ వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, కేవలం వెండితెరకే పరిమితం కాకుండా రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్నారు. తన స్వచ్ఛంద సంస్థ ‘సంజోష్ ఫౌండేషన్’ (Sanjosh Foundation) ఆధ్వర్యంలో నిరంతరం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మే 18, 2026న ములుగు జిల్లా గిరిజన ప్రాంతమైన ఏటూరునాగారంలో సంజోష్ ఫౌండేషన్ తరఫున ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. ఇందులో భాగంగా పదో తరగతిలో 500కు పైగా మార్కులు, అలాగే ఇంటర్మీడియట్‌లో 900కు పైగా మార్కులు సాధించి ఆర్థికంగా వెనుకబడిన 118 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున నగదు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. ఈ ఆర్థిక సాయం ద్వారా విద్యార్థులకు ఉన్నత చదువులపై మరింత ప్రోత్సాహం అందించినట్లయింది.

ఎక్కువ మంది చదివినవి : Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ప్రముఖ నటుడు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులంతా కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సంజోష్ చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ ఉదాత్తమైన కార్యక్రమానికి పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు , ప్రముఖులు విచ్చేశారు. ఏఎస్పీ మనన్ భట్ IPS, పూజారి నాగేశ్వరరావు, డీఈఓ (DEO) సిద్ధార్థ్ రెడ్డి, ఎంఈఓ (MEO) మల్లిక్ తదితరులు పాల్గొని విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను బహూకరించారు. వెనుకబడిన గిరిజన ప్రాంత విద్యార్థుల భవిష్యత్తు కోసం నటుడు సంజోష్ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను, ఆయన సేవా గుణాన్ని అధికారులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

ఎక్కువ మంది చదివినవి : Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..

సంజోష్ ఫౌండేషన్ ఇటువంటి సేవలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా గిరిజన ప్రాంతాల్లో ఎందరో పేద ప్రజల కోసం 168 ఉచిత మొబైల్ కంటి క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి వారికి చూపు ప్రసాదించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు టైలు, బెల్ట్లు, షూస్, ఎగ్జామ్ కిట్లను ఉచితంగా అందజేస్తున్నారు. అంతేకాకుండా, ముగ్గురు అనాథ విద్యార్థుల పూర్తి చదువు బాధ్యతలను సంజోష్ వ్యక్తిగతంగా చూసుకుంటూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఎదుగుతూనే, మరోవైపు సమాజం పట్ల బాధ్యతగా నడుచుకుంటూ గిరిజన ప్రాంతాల్లో సంజోష్ అందిస్తున్న సేవలకు గానూ స్థానిక ప్రజల నుండి, అభిమానుల నుండి ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు.. జగపతి బాబు..

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..

Follow Us