Taapsee Pannu: ఆ సినిమాతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న క్యూట్ గ‌ర్ల్ తాప్సీ !

తాప్సీ మనమ్మాయి అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు షి ఈజ్‌ కంప్లీట్లీ నార్త్ గర్ల్. చేసేవి కూడా హిందీ సినిమాలే. అయినా నేనింకా తెలుగమ్మాయినే అంటున్నారు....

Taapsee Pannu: ఆ సినిమాతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న క్యూట్ గ‌ర్ల్ తాప్సీ !
Taapsee Pannu

Updated on: Jun 16, 2021 | 2:43 PM

తాప్సీ మనమ్మాయి అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు షి ఈజ్‌ కంప్లీట్లీ నార్త్ గర్ల్. చేసేవి కూడా హిందీ సినిమాలే. అయినా నేనింకా తెలుగమ్మాయినే అంటున్నారు తాప్సీ. త్వరలోనే స్ట్రెయిట్‌ తెలుగు సినిమా చేయబోతున్నారు. హసీనా దిల్‌రుబా, రష్మి రాకెట్‌, లూప్‌ లపేటా, దుబారా, శభాష్‌ మిథు… ఇవి కాక తమిళ్‌లో జనగణమణ… ఇవీ తాప్సీ కిట్టీలో ఉన్న సినిమాలు. వీటిలో శభాష్‌ మిథు తప్ప మిగిలినవన్నీ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని రెడీ టు రిలీజ్‌ అన్న స్టేజ్‌లోనే ఉన్నాయి. చేతిలో ఇన్ని సినిమాలున్నా వీటిలో మన సినిమా ఒకటి కూడా లేకపోవడంతో, తాప్సీ చూపులు సౌత్‌ వైపు లేనే లేవనే కన్‌ఫర్మేషన్‌కి వచ్చేశారు మనవారు. అయితే… అలాంటిదేమీ లేదు. త్వరలోనే ఓ సినిమా చేస్తానంటున్నారు తాప్సీ. అదే నిజమైతే 2019లో చేసిన గేమ్‌ ఓవర్‌ తర్వాత తాప్సీ చేస్తున్న స్ట్రెయిట్‌ తెలుగు సినిమా ఇప్పుడేనన్నమాట.

ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ మూవీలో వెరైటీ కాన్సెప్ట్ ని డీల్‌ చేసిన స్వరూప్‌ త్వరలోనే తాప్సీ మెయిన్‌ లీడ్‌గా మిషన్‌ ఇంపాజిబుల్‌ అనే మూవీని స్టార్ట్ చేయబోతున్నారట. ఎన్నాళ్లుగానో తాప్సీ వెయిట్‌ చేస్తున్న పర్ఫెక్ట్ కమర్షియల్‌ హిట్‌ ఈ మూవీతో అయినా వస్తుందా? అనేది ఎదురుచూడాలి.

Also Read: ఖమ్మం జిల్లాలో వింత.. రాముడి విగ్రహం కళ్ళ నుండి నీళ్ళు !

భార్య‌తోనే ఉంటా.. మైన‌ర్ బాలుడి మారాం.. చివ‌రకు కోర్టు ఏం చెప్పిందంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us