Sushmita Konidela
సంతోష్ శోభన్.. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ కుర్రహీరో. తాజాగా ఈ యంగ్ హీరో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రానన్ని సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. నిర్మాత సుస్మిత కొణిదెల మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సుస్మిత మాట్లాడుతూ.. శ్రీదేవి శోభన్‌బాబు నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా. సంతోష్, ప్రశాంత్‌ని అనుకోకుండా ఓ కాఫీ షాప్‌లో కలిశాను. అలా స్టార్ట్ అయిన మా ప్రయాణం ఇక్కడి వరకు వచ్చింది అన్నారు. చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ సినిమా కోసం అందరం మనసు పెట్టి పని చేశాం. మా అందరిలోని ఇన్నోసెంట్ ఎమోషన్స్ అన్నీ స్క్రిప్ట్‌కి ట్రాన్స్ఫర్ అయ్యింది. సిటీలో పుట్టి పెరిగిన సంతోష్‌లాంటి హీరో ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ పాత్రను అద్భుతంగా చేశాడు. గౌరికి తెలుగు రాకపోయినా నాతో కూర్చుని తమిళంలో అర్థం తెలుసుకుని దాన్ని తెలుగులో నేర్చుకుని మరీ నటించింది.
ప్రశాంత్ బలం.. నెటివిటీ. మన ఇంట్లో మనం ఎలా బిహేవ్ చేస్తామో దాన్ని చక్కగా క్యారీ చేస్తాడు. అదే ఈ సినిమాలోనూ చేశాడు. తను ప్రాణం పెట్టి.. చక్కటి ఎమోషన్స్‌తో సినిమాను పూర్తి చేశాడు. బాషా, మొయిన్ వంటి యంగ్ టాలెంట్‌తో నే కాదు.. నాగబాబుగారు, రోహిణిగారి వంటి సీనియర్స్ కూడా సినిమాలో నటించారు. గోల్డ్ బాక్స్ బ్యానర్ ముందు నేనున్నప్పటికీ నా వెనుక మావారు విష్ణు, మా కో ప్రొడ్యూసర్ శరణ్య సపోర్ట్‌గా నిలిచారు. ఫిబ్రవరి 18న మీ దగ్గరున్న థియేటర్స్‌లో ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా వస్తుంది. రేపు (సోమవారం ) ఓ పాటను రిలీజ్ చేస్తున్నాం. కమ్రాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు’’ అన్నారు.