సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు వయసు పెరుగుతునప్పటికీ ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం రజినీ చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి.అందులో ఒకటి డైరెక్టర్ నెల్సన్ తెరకెక్సిస్తున్న మూవీ జైలర్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. అలాగే ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రంలోనూ రజినీ నటిస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ రెండు సినిమాల తర్వాత రజినీ జైభీమ్ చిత్రం ఫేమ్ టీజే. జ్ఞానవేల్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన కెరీర్ లోనే 170వ చిత్రంగా రాబోతుండగా.. ఈ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది.
ఇక తాజాగా రజినీకాంత్ 171 సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం దర్శకులు.. నిర్మాతలు క్యూకట్టారట. ఓవైపు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రజినీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే.. ఈ సినిమాను నిర్మించేందుకు కమల్ హాసన్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేటేస్ట్ సమాచారం ప్రకారం రజినీ 171 వ చిత్రాన్ని లేడీ డైరెక్టర్ సుధ కొంగర తెరకెక్కించనున్నారట. ఇరుదు చుట్ట్రు, సూరరైపోట్రు వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను రూపొందించిన ఆమె.. ఇప్పుడు రజినీతో సినిమా చేయాలని చూస్తున్నారట. ఇందుకు సంబంధించిన సన్నాహలు కూడా జరగనున్నాయట.
ఇక సుధా కొంగర, రజినీ కాంబోలో రాబోయే సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అన్ని విషయాలను అనౌన్స్ చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.