చాలా కాలం గ్యాప్ తర్వాత హీరో గోపిచంద్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం రామబాణం. ఈ సినిమాలో మ్యాచో స్టార్ సరసన ఖిలాడీ బ్యూటీ డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తుండగా.. డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు అరనేక చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన గోపిచంద్ సరైన హిట్ అందుకోలేకపోయారు. కథ.. కథనం బాగున్నప్పటికీ అనుకోని కారణాల వల్ల విజయాన్ని సాధించలేకపోయాయి. ఇక ఇప్పుడు ఆయన నటిస్తున్న రామబాణం సినిమా మే5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు పెద్ద ఎత్తున షూరు అయ్యాయి. ఇందులో భాగంగా తాజాగా డైరెక్టర్ తేజతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు గోపిచంద్. ఇందులో తేజ అడిగిన ప్రశ్నలకు గోపిచంద్ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో డైరెక్టర్ తేజ ఎన్నో ప్రశ్నలు అడిగినప్పటికీ గోపిచంద్ ఎంతో కూల్ గా సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే రామబాణం షూటింగ్ సమయంలో డైరెక్టర్ శ్రీవాస్ తో జరిగిన గొడవలపై నేరుగా ప్రశ్నించారు తేజ. అయితే దీనిపై గోపిచంద్ మాట్లాడుతూ.. సినిమాలో లెంగ్త్ లు ఎక్కువయ్యిపోతున్నాయని.. ఇలా జరిగిన గత సినిమాల రిజల్ట్ తనకు తెలుసని గోపిచంద్ అన్నారు. అందుకే ఇద్దరి మధ్య చిన్న ఇష్యూ వచ్చిందని తెలిపారు. అయితే ఫుల్ ఇంటర్వ్యూ చూస్తే గానీ అసలు విషయం తెలియదు.
అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రావడం లేదనే విషయంపై క్లారిటీ ఇచ్చారు గోపిచంద్. అలాగే తేజతో మ్యాచో స్టార్ చేయాల్సిన సినిమా ఆగిపోవడానికి కూడా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తేజ తెరకెక్కించిన జయం సినిమాలో గోపిచంద్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించిన సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.