Pushpa: సేమ్ పుష్ప మేనరిజం.. శ్రీహరి అన్న 20 ఏళ్ల క్రితమే చేశారుగా.. వీడియో చూశారా..?

2021లో రిలీజైన పుష్ప పాన్ ఇండియా లెవల్లో భారీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇందులోని 'తగ్గేదేలే' అనే మేనరిజం తెగ ఫేమస్ అయింది. అల్లు అర్జున్ వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా రియల్ స్టార్ శ్రీహరికి సంబంధించిన ఓ వీడియోను పుష్పకి లింక్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Pushpa: సేమ్ పుష్ప మేనరిజం.. శ్రీహరి అన్న 20 ఏళ్ల క్రితమే చేశారుగా.. వీడియో చూశారా..?
Allu Arjun Srihari
Follow us

|

Updated on: Mar 26, 2024 | 11:10 AM

అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ పుష్ప. కలెక్షన్ల సునామీ సృష్టించింది ఈ చిత్రం. పాన్ ఇండియా లెవల్‌లో అల్లు అర్జున్ పేరు మారుమోగిపోయింది. పుష్ప గెటప్, స్వాగ్, సాంగ్స్ అని ట్రెండ్ క్రియేట్ చేశాయి. తగ్గేదే లే.. డైలాగ్ ఇప్పటికీ దేశమంతటా యూజ్ చేస్తున్నారు. అయితే పుష్ప క్యారెక్టర్‌కి ఓ టిపికల్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఒక భుజం పైకెత్తి .. నడుస్తూ ఉంటాడు పుష్ప. అయితే దివంగత రియల్ స్టార్ శ్రీహరి.. కూడా ఓ సినిమాలో ఇదే మాదిరిగా కనిపించారు. ‘పృథ్వీ నారాయణ’ అనే సినిమాలో..  శ్రీహరి నడుస్తూ వచ్చే స్టైల్, నిలబడే విధానం.. యాటిట్యూడ్ అన్నీ కూడా పుష్ప క్యారెక్టర్ మాదిరిగానే ఉంటాయి. శ్రీహరి మూవీ క్లిప్ చూసిన నెటిజన్స్ స్టన్ అవుతున్నారు. 2002లో వచ్చిన.. శ్రీహరి సినిమా క్లిప్‌ను పుష్పతో కంపార్ చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల కింద వచ్చి ఈ మూవీలో శ్రీహరి డబుల్ రోల్ చేశారు. అందులో ఒక రోల్‌కు పుష్ప వంటి యాటిట్యూడ్ ఉందన్నమాట.

పుష్ప మేనరిజమ్.. మా హీరో ఎప్పుడో చేశాడని శ్రీహరి అభిమానలు కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి పుష్ప గెటప్ కాపీనా అని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. మాలీవుడ్‌ సూపర్ స్టార్ మోహన్ లాల్ వాకింగ్ స్టైల్ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. ఆయన ఓ భుజం పైకెత్తి నడుస్తూ ఉంటారు. అలా అని పుష్ప కాపీ అనడానికి లేదు. ఆ క్యారెక్టర్ అనుకున్నదాన్ని బట్టి.. బాడీ లాంగ్వేజ్ ఫిక్స్ చేశాడు దర్శకుడు సుకుమార్. ఏది ఏమైనా ఆ గెటప్, మేనరిజం, యాటిట్యూడ్ అని చెప్పడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.