Allu Arjun: అల్లు అర్జున్‏కు స్పెషల్ గిఫ్ట్స్ పంపిన శ్రీలీల.. బన్నీ రియాక్షన్ ఏంటంటే..

|

Nov 16, 2024 | 1:42 PM

ప్రస్తుతం యావత్ పాన్ ఇండియా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్లను గ్రాండ్ గానే ప్లాన్ చేసింది చిత్రయూనిట్. రెగ్యులర్‏గా కాకుండా పుష్ప 2 ప్రమోషన్స్ కాస్త విభిన్నంగా ప్లాన్ చేసినట్లు సమాచారం.

Allu Arjun: అల్లు అర్జున్‏కు స్పెషల్ గిఫ్ట్స్ పంపిన శ్రీలీల.. బన్నీ రియాక్షన్ ఏంటంటే..
Allu Arjun, Sreeleela
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నా జంటగా నటించిన సినిమా పుష్ప 2. మూడేళ్ల క్రితం విడుదలైన పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ పై మరింత హైప్ ఏర్పడింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. ముఖ్యంగా గంగమ్మ అవతారంలో బన్నీ గెటప్ చూస్తే ఈసినిమా ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మరోవైపు సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు రోజుకో అప్డేట్ రివీల్ చేస్తున్నారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. పుష్ప 1లో ఊ అంటావా మావ ఊహు అంటావ అంటూ అదరగొట్టేసింది సమంత. అప్పట్లో ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేసింది. ఇక దీంతో పుష్ప 2లో ఉండే స్పెషల్ సాంగ్ మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ పాటలో శ్రీలీల బన్నీతో కలిసి స్టెప్పులేయనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ శ్రీలీల స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇద్దరూ టాలెంటెడ్ డాన్సర్స్ కలిసి స్టేజ్ మీద ఏ రేంజ్ లో డాన్స్ మూమెంట్స్ చేస్తారో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

Allu Arjun

తాజాగా బన్నీకి స్పెషల్ గిఫ్ట్స్ పంపించింది శ్రీలీల. బన్నీతోపాటు అతడి భార్య స్నేహారెడ్డి, పిల్లలకు కూడా అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చింది. కలర్ లెటర్స్ పై తన అభిప్రాయాలను రాసి గిఫ్ట్ ప్యాక్స్ గా వారికి పంపించింది. వాటిని బన్నీ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ శ్రీలీలకు థాంక్స్ చెప్పాడు. అలాగే ఆమెను డ్యాన్సింగ్ క్వీన్ అంటూ పిలవడం విశేషం. “నువ్వు పంపించిన గిఫ్ట్స్ ఇప్పుడే చూశాను. అందులో నువ్వు రాసిన లెటర్ లో ని మాటలు నా మనసును తాకింది. నీ ప్రేమకు నా కృతజ్ఞతలు” అంటూ బన్నీ రాసుకొచ్చారు.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.