
యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా “దీవాన”. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఇటీవల గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “దీవాన” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర థ్యాంక్యూ మీట్ ను హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి సింధు మాట్లాడుతూ – మా పేరెంట్స్ “దీవాన” సినిమా చూసి ఎమోషనల్ అయ్యారు. మా మదర్ కన్నీళ్లు పెట్టుకుంది. మా పేరెంట్స్ లాగానే మిగతా ప్రేక్షకులంతా మా మూవీకి బాగా రిలేట్ అవుతున్నారు. ఈ సినిమాలో పార్ట్ కావడం హ్యాపీగా ఉంది. అన్నారు.
నటుడు నర్సింగ్ వాడేకర్ మాట్లాడుతూ – మంచి మూవీస్ ఎక్కడున్నా వచ్చి సపోర్ట్ చేసే శ్రీవిష్ణు గారికి థ్యాంక్స్. మాది చిన్న సినిమా కాదు పది పెద్ద సినిమాలను కొట్టే సినిమా. ఈ సినిమాలో ఫ్రెండ్స్ గా నటించిన మేమంతా నిజంగానే మంచి స్నేహితులం అయ్యాం. ఈ సినిమాకు వెళ్లి చూడండి. నచ్చకపోతే నేను మళ్లీ సినిమాల్లో నటించను’ అని అన్నారు. నటుడు టోనీ మాట్లాడుతూ – చిన్న సినిమాలను ప్రమోట్ చేయడంలో మెగాస్టార్ శ్రీవిష్ణు అన్న. ఆయన బ్రోచేవారెవరురా సినిమాలో నేను నటించాను. ఆయన ఈ రోజు మా మూవీ థ్యాంక్యూ మీట్ కు రావడం హ్యాపీగా ఉంది. సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ మాది. మమ్మల్ని మా అమ్మ ఎంతో కష్టపడి పెంచింది. ఇప్పటికే కష్టపడుతోంది. అమ్మకు త్వరలోనే మా “దీవాన” సినిమా చూపించాలని అనుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఇక మరో నటుడు కె కె మాట్లాడుతూ – మా “దీవాన” సినిమా మీ అందరి సపోర్ట్ తో ఒక మైలేజ్ కు వచ్చి పికప్ అందుకుంది. అందుకే ఎలాంటి హార్డ్ ఫీలింగ్స్ లేకుండా హ్యాపీగా థ్యాంక్యూ మీట్ చేస్తున్నాం. ఈ మూవీలో చెప్పినట్లు మీరు జీవితంలో ఏం సాధించినా, ఏ స్థాయిలో ఉన్నా తల్లిదండ్రులను సంతోషంగా ఉంచండి’ అని పేర్కొన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ ఝాన్సీ గోల మాట్లాడుతూ – డైరెక్టర్ శ్రీకాంత్ గారు ఎంతో క్లారిటీగా ఈ సబ్జెక్ట్ నాకు చెప్పారు. ఆయన చెప్పిన డీటెయిలింగ్ వల్ల మూవీకి ప్రొడక్షన్ చేయడం సులువైంది. వీలైనంత నాచురల్ గా ఉండేలా ప్రొడక్షన్ డిజైన్ చేశాం. ఈ రోజు మా మూవీకి ఇంతమంచి విజయం దక్కడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్ మాట్లాడుతూ – “దీవాన” సినిమా రిలీజైనప్పటి నుంచి నేను రోజూ థియేటర్స్ కు వెళ్తున్నాను, మూవీ చూస్తున్నాను. థియేటర్స్ లో ప్రేక్షకులు మూవీని ఎంజాయ్ చేయడం గమనిస్తున్నాను. మా టీమ్ అందరికీ మంచి కెరీర్ ఇచ్చే సినిమా ఇది. డైరెక్టర్ శ్రీకాంత్ ఈ చిత్రంతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రొడ్యూసర్ వాసు, శ్రీదేవి పెద్ద ప్రొడ్యూసర్స్ గా స్థిరపడతారు. ఈ వీకెండ్ లో మా సినిమా చూడండి. ఈ ఫీల్ మీకు కనీసం పదేళ్లు గుర్తుంటుంది’ అని పేర్కొన్నారు. లిరిసిస్ట్ అలరాజు మాట్లాడుతూ – మా “దీవాన” సినిమాలో ఒక కొడుకు కోసం ఒక తల్లి పడే ఆరాటం ఉంటుంది, ఒక కొడుకు కోసం ఒక తండ్రి చేసే పోరాటం ఉంటుంది. ఒక స్నేహితుడి కోసం మిత్రులు పడే ఉబలాటం ఉంటుంది. తను ప్రేమించిన అమ్మాయి కోసం ఒక కుర్రాడు చేసే యుద్ధం ఉంటుంది. తప్పకుండా మా సినిమా చూడండన్నారు.
నటుడు రఘు కారుమంచి మాట్లాడుతూ – ఈ సినిమాకు ఇంకా హీరో కూడా సెలెక్ట్ కాకముందే ఈ సినిమాలో రామ్ సింగ్ క్యారెక్టర్ మీరే చేస్తున్నారు అన్నాడు డైరెక్టర్ శ్రీకాంత్. నటుడిగా పాతికేళ్ల కెరీర్ నాది, 300 చిత్రాల్లో నటించాను. నాకు సురేందర్ రెడ్డి, వినాయక్ గారు నటుడిగా జన్మనిచ్చారు. ఇప్పుడు ఇన్నేళ్ల కెరీర్ చూశాక శ్రీకాంత్ నటుడిగా నాలో కొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించాడు. నా రియల్ లైఫ్ లో నేను మున్నానే. అంతే అల్లరిగా ఉండేవాడిని. నా లైఫ్ చూసే ఈ సినిమా చేశారా అనిపిస్తుంటుంది. దీవాన ఒక బ్యూటిఫుల్ ఫిలిం మీరు తప్పకుండా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ – సినిమానే జీవితం అనుకున్నా. దీవాన సినిమా అవకాశం కల్పించడం ద్వారా నాకు జీవితాన్ని ఇచ్చారు ప్రొడ్యూసర్స్ వాసు, శ్రీదేవి. దీవాన మూవీని బ్యాడ్ చేసేందుకు చాలామంది ప్రయత్నించారు. ఆ టైమ్ లో నాకు ఏమీ కాని మీడియా మిత్రులు సపోర్ట్ గా నిలిచారు. మా సినిమా కథను పేపర్ మీద నేను రాస్తే, స్క్రీన్ మీద రాసినట్లు తెరకెక్కించింది మా డీవోపీ వంశీ. సలీం అనార్కలి లవ్ కంటే నాకు నా దీవాన ఎక్కువ. ఈ సినిమాను చంపాలని ఎంత చూసినా లేస్తూనే ఉంటుంది. థియేటర్స్ కు వెళ్లి చూడండి ఐదు రోజుల్లో ఐదుసార్లు చూశామని చెబుతున్న వాళ్లున్నారు. ఈ సినిమాను మీ పిల్లల్ని పక్కన పెట్టుకుని బిగ్ స్క్రీన్ లో చూడండి. మీరు చిన్న టీవీలో మా మూవీ చూడటం నాకు ఇష్టం లేదు. స్మాల్ బడ్జెట్ మూవీ బిగ్ స్క్రీన్ మీద ఇంత బ్యూటిపుల్ ఎక్సిపీరియన్స్ ఇస్తుందంటే అందుకు నా రైటింగ్ లోని శక్తి కారణం. మా కాస్టింగ్ కారణం. వంద కోట్ల బడ్జెట్ సినిమాలో కూడా మా మూవీలోని షాట్స్ ఉండవు. ఏ భాషలో రాని సినిమా ఇది. మీరంతా బిగ్ స్క్రీన్ లో మూవీ చూస్తేనే నాకు ఆనందం. అన్నారు.
ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ – మా సినిమా థ్యాంక్యూ మీట్ కు అతిథిగా వచ్చిన శ్రీవిష్ణు గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. మూవీలో నరేష్ గారి క్యారెక్టర్ హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. జర్నలిస్ట్ ప్రేమ గారు సింగీతం, మా ఇంటి బంగారం, దీవాన మూవీ పోస్టర్స్ నాకు పంపుతూ ఈ మూడు చిత్రాలు లేడీ ప్రొడ్యూసర్స్ చేసినవి, ఇలాంటి మంచి చిత్రాలు చూస్తే మనసు నిండిపోతుంది అని ప్రశంసించారు. మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రేమ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మా మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో చెప్పాను. మా మున్నా, అమ్ము మిమ్మల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, వారితో ప్రేమలో పడేలా చేస్తారు అని. ఈ రోజు థియేటర్స్ లో సినిమా చూస్తున్న ఆడియెన్స్ అదే ఫీల్ అవుతున్నారు. ఇటీవల కాలంలో మా సినిమాకు వచ్చినన్ని రీల్స్ మరే మూవీకి రాలేదు. ఆడియెన్స్ వాళ్లకు వాళ్లు రియాక్ట్ అయి రీల్స్ చేస్తున్నారు. నేను వాసు ప్రొడ్యూసర్స్ అవుదామని అనుకున్నప్పుడు మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వచ్చిన వ్యక్తి అరవింద్ గారు. ఆయన మాకోసం ఉన్నారనే ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. ప్రొడ్యూసర్ విద్య అక్కకు కూడా థ్యాంక్స్. మేము చాలా మంచి సినిమా చేశాం. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా చేశాం. అన్నారు.
ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ – మా దీవాన మూవీకి కథే హీరో. ఈ బ్యూటిఫుల్ కథకు మా టెక్నికల్ టీమ్ అందరూ స్క్రీన్ మీద లైఫ్ తీసుకొచ్చారు. మాకు అరవింద్ గారు, విద్య అక్క ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేము. ఇప్పట్లో దీవాన సినిమా ఓటీటీలోకి రావడం లేదు. ఈ చిత్రాన్ని మీరు థియేటర్స్ లోనే ఎంజాయ్ చేయాలి. ఒక పెళ్లి చూపులు, ఒక కేరాఫ్ కంచెరపాలెం లాగ ఎప్పుడో ఒకసారి వచ్చే చిత్రమిది. మీకు రెండున్నర గంటలు బ్యూటిఫుల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చే సినిమా దీవాన. సినిమా అనేది అందుబాటు ధరల్లో ఉండాలనేది మా కోరిక. అందుకే సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలు, అన్ని పీవీఆర్ స్క్రీన్స్ లో 105 రూపాయలకే టికెట్ ప్రైస్ పెట్టాం’ అని తెలిపారు.
హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ – దీవాన సినిమా ఒక మిరాకిల్ బేబి లాంటిది. మా సినిమాకు స్టార్ పవర్ లేదు. అంతా కొత్త వాళ్లమే చేశాం. కొత్త వాళ్లం చేసిన మా సినిమా ఫస్ట్ వీక్ తర్వాత కూడా థియేటర్స్ లో 70 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉందంటే అదే మాకు నిజమైన సక్సెస్ గా భావిస్తున్నాం. నేను హీరోగా చేసిన ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేసింది సమంత గారు. ఆమె సినిమాతో పాటు మా దీవాన మూవీ రిలీజ్ అవుతుందంటే ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. అలాంటి సూపర్ హిట్ సినిమాతో పాటు మా సినిమా కూడా సక్సెస్ పుల్ గా రన్ అవుతుందంటే అదీ మా విజయమే అనుకుంటున్నాం. ప్రేక్షకులు మా సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ను గుర్తుపెట్టుకుంటున్నారు, ఓన్ చేసుకుంటున్నారు. అది కూడా మా విజయమే. 19న రిలీజ్ అని మేము చాలా ప్రమోట్ చేశాం. ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. అయినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటే అదీ మా విజయమే. సినిమా చూసిన ఆడియెన్స్ మరికొందరికి మూవీ చూడమని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది, ట్విస్ట్ బాగుందని అంతా చెప్పుకున్నా, వారు ఎక్కడా ఆ ట్విస్ట్ ను బయటపెట్టలేదు. అలా మా సినిమాను ప్రేక్షకులే కాపాడుతున్నారు. మా మూవీ సక్సెస్ విషయంలో మేము పూర్తి సంతృప్తితో ఉన్నాం. థియేటర్స్ కు ఫ్యామిలీని అనుమతించడం లేదని కొందరు నాకు చెబుతుంటే బాధగా అనిపిస్తోంది. దీవాన ఒక అరుదైన మూవీ. థియేటర్స్ లో చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు’ అని ముగించారు.
నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ – ఈ వేదిక మీద మాట్లాడిన ప్రతి ఒక్క టీమ్ మెంబర్ తమ జెన్యూన్ ఎమోషన్ తో స్పందించారు. ఇలాంటి హానెస్ట్ మూవీస్ రావాలి. నిజాయితీతో చేసిన ప్రేమ కథ కాబట్టే దీవాన విజయం సాధించింది. ఈ సినిమా టీమ్ అంతా గొప్ప స్థాయికి వెళ్తారు. టీమ్ లోని ప్రతి ఒక్కరూ ఈ మూవీ కోసం ప్యాషనేట్ గా వర్క్ చేశారు. డైరెక్టర్ శ్రీకాంత్ మరో పది సినిమాలు చేయగలడు. వాసు, శ్రీదేవి ఎప్పుడూ మూవీ గురించే ఆలోచించేవారు. ఇలాంటి మంచి చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. మీరు దీవాన సినిమాను థియేటర్ కు వెళ్లి చూడండని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ – ప్రొడ్యూసర్ విద్య గారు దీవాన మూవీ గురించి బాగుందని నాకు చెప్పారు. థ్యాంక్యూ మీట్ పెడుతున్నారు అని అన్నారు. వాసు గారు గెస్ట్ గా రావాలని నన్ను ఇన్వైట్ చేశారు. దీవాన సినిమా చూశాను. చాలా బాగుంది. మూవీలో ఝాన్సీ గారు, నరేష్ గారు మిగతా కాస్టింగ్ అంతా పర్పెక్ట్ గా కుదిరింది. డీవోపీ వర్క్, మ్యూజిక్ ఆకట్టుకుంది. ఇంటర్వెల్ పదిహేను నిమిషాల ముందు సినిమా ఒక జోన్ లోకి ఎంటర్ అయ్యింది. తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇంటర్వెల్ నేను చూడలేదు. ఇలా ఎందుకు చేశాడని డైరెక్టర్ మీద కోపం వచ్చింది. క్యారెక్టర్స్ మీద లవ్ ఉన్నప్పుడే మనకు కోపం వస్తుంటుంది. హర్షిత్ నటన, వాయిస్ అంటే నాకు ఇష్టం. సహజంగా నటిస్తాడు. ఇతనికి మంచి ప్రాజెక్ట్ పడితే పేరు తెచ్చుకుంటాడు అనిపించింది. ఇది లవ్ స్టోరీనే కాదు లైఫ్ గురించి చాలా డెప్త్ ఉన్న స్టోరీ. ఎంతో ఎక్సిపీరియన్స్ చేస్తే గానీ ఇలాంటి డెప్త్ ఉన్న రైటింగ్ రాదు. సెకండాఫ్ ఎలా ఉంటుంది అనుకుంటూ మూవీ చూశా. పర్ ఫార్మెన్స్ లు అన్నీ బాగున్నాయి. సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి మనకొక ఫుల్ ఫిల్ నెస్ వస్తుంది. దీవాన బ్యూటిఫుల్ ఫిలిం. ప్రతి ఒక్కరూ చూడాలి. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. డైరెక్టర్ శ్రీకాంత్ కు మంచి టీమ్ దొరికింది. గీతా ఆర్ట్స్ దొరికింది. సినిమా బాగుందని అంటున్నారు. ఇవన్నీ మీరు(డైరెక్టర్) ఆస్వాదించండి. నావంతుగా ఈ సినిమాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. రేపు శనివారం ఏపీ తెలంగాణలో ప్రతి ఊర్లో ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం. మీకు సినిమా నచ్చితే మరొకరిని థియేటర్స్ కు తీసుకెళ్లండి, లేదా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టండి. అది దీవాన సినిమాకు బూస్ట్ ఇస్తుంది. ఈ సినిమా నచ్చకుండా ఉండదు అనే కాన్ఫిడెన్స్ తో చెబుతున్నా. ఒకవేళ మీ టైమ్ వేస్ట్ అయ్యింది అనిపిస్తే చెప్పండి, నెక్ట్స్ నా సినిమా వచ్చినప్పుడు వడ్డీతో కలిపి ఇచ్చేస్తా. ఇది యూత్ ఫుల్ మూవీ అనుకుంటాం కానీ హ్యాప్పీగా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. మీ ఫ్యామిలీని తీసుకెళ్తే ఇంకా బాగా నచ్చుతుంది. ఈ సినిమాను మరింతగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు.