Viral Photo: గ్లామర్ క్వీన్.. నటనలో ఎవరెస్ట్.. ఎందరికో ఫేవరెట్.. ఎవరో గుర్తించారా..?

ఒకప్పుడు అభిమాన నటుడు లేదా నటితో ఫోటో దిగడమంటే పెద్ద టాస్క్. కానీ సోషల్ మీడియా ట్రెండ్ పెరగడంతో అది చాలా ఈజీ అయిపోయింది. ఇక లైవ్ చాట్స్ లో నిత్యం అభిమానులతో మాట్లాడుతున్నారు సెలబ్రిటీస్.

Viral Photo: గ్లామర్ క్వీన్.. నటనలో ఎవరెస్ట్.. ఎందరికో ఫేవరెట్.. ఎవరో గుర్తించారా..?
Heroine Childhood Photo

Updated on: Mar 14, 2022 | 7:50 PM

Tollywood: ఇప్పుడు ఇంటర్నెట్ యుగం నడుస్తుంది. దీంతో సెలబ్రిటీలకు, వారి అభిమానులకు మధ్య గ్యాప్ తగ్గిపోయింది. ఒకప్పుడు అభిమాన నటుడు లేదా నటితో ఫోటో దిగడమంటే పెద్ద టాస్క్. కానీ సోషల్ మీడియా(Social Media) ట్రెండ్ పెరగడంతో అది చాలా ఈజీ అయిపోయింది. ఇక లైవ్ చాట్స్ లో నిత్యం అభిమానులతో మాట్లాడుతున్నారు సెలబ్రిటీస్. వారి చిన్ననాటి ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటున్నారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఉంది ఎవరో ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఈమె తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో 200పైగా  సినిమాల్లో నటించింది. మమ్ముట్టి, రజనీకాంత్‌, చిరంజీవి, నాగార్జున సహా పలు భాషల్లోని చాలా మంది ప్రముఖ నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఏంటి ఇంకా గుర్తించలేదా.. అయితే మేమే చెప్పేస్తాం. ఇందులో ఉంది స్టార్ నటి..రమ్యకృష్ణ. 1970, సెప్టెంబర్ 15న జన్మించిన రమ్యకృష్ణ.. తన 13 సంవత్సరాల వయస్సులో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ‘వెళ్ళై మనసు’ అనే చిత్రంతో వెండితెరకి పరిచయం అయ్యింది.  1990 నుంచి 2000.. ఈ ప‌దేళ్ల గ్యాప్‌లో ఎన్నో సంచ‌ల‌న సినిమాలు చేసింది ర‌మ్య‌కృష్ణ‌. అప్పట్లో హాట్ అనే పదానికి రమ్యను పర్యాయపదంగా చెప్పేవారు.  2003 జూన్ 12న తెలుగు డైరెక్టర్ కృష్ణ వంశీతో రమ్య వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. తమిళనాడుకు చెందిన రమ్య.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడింది.  సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ‘బాహుబలి: ద బిగినింగ్’ సినిమాకు ఉత్తమ నటిగా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డు, ఐఫా అవార్డు సొంతం చేసుకుంది. ‘బాహుబలి: ద కంక్లూజన్’ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డు దక్కించుకుంది. ప్రస్తుతం రమ్య నటించిన రవి బోపన్న, లైగర్, పార్టీ, రంగ మార్తాండ వంటి చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.

Also Read: సేద తీరేందుకు చెట్టు కిందకు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వెన్నులో వణుకు

Loading...
Unable to load recommendations.
Follow Us