Sonu Sood: ఎస్కలేటర్ పై సోనూసూద్ విన్యాసాలు.. అదుర్స్ అంటున్న నెటిజన్స్.. వీడియో వైరల్..

అడిగిన వారికి లేదనకుండా సాయం చేసి రియల్ హీరో అయ్యాడు నటుడు సోనూసూద్. లాక్‏డౌన్ సమయంలో సోనూ సూద్ చేసిన సహాయాలు,

Sonu Sood: ఎస్కలేటర్ పై సోనూసూద్ విన్యాసాలు.. అదుర్స్ అంటున్న నెటిజన్స్.. వీడియో వైరల్..
Sonu Sood

Updated on: Aug 26, 2021 | 5:59 PM

అడిగిన వారికి లేదనకుండా సాయం చేసి రియల్ హీరో అయ్యాడు నటుడు సోనూసూద్. లాక్‏డౌన్ సమయంలో సోనూ సూద్ చేసిన సహాయాలు, సామాజిక సేవలకు ఆయన క్రేజ్ భారీగా పెరిగింది. దీంతో దేశంలోనే కాకుండా.. విదేశాల్లోనూ రియల్ హీరోకు అభిమానులు పెరిగిపోయారు. ఇక సోషల్ మీడియాలో సోనూ సూద్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే సోనూసూద్ సైతం నిత్యం నెట్టింట్లో యాక్టివ్‏గా ఉంటూ తన ఫ్యాన్స్‏కు టచ్‏లో ఉంటున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సహాయ కార్యక్రమాలు చేస్తూ ఆల్ టైం బిజీగా గడిపేస్తున్న సోనూసూద్.. కాస్త సమయం దొరికితే చాలు నెట్టింట్లో తనకు సంబంధించిన అప్‏డేట్స్ ఇస్తున్నారు. ఇటీవల ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో సోనూ సూద్ పోటీ చేయబోతున్నారంటూ వచ్చిన కథనాలపై రియల్ హీరో సున్నితంగా స్పందించాడు. ఒక సాధారణ వ్యక్తిగా తను ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని.. రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశాడు.

తాజాగా సోనూసూద్ విమానాశ్రమంలోని ఎస్కలేటర్ పై విన్యాసాలు చేస్తున్న వీడియోను ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అందులో విమానాశ్రయంలోని ఎస్కలేటర్ పై సోనూసూద్ కాళ్లు కింద పెట్టకుండా… చేతులతో ఎస్కరేటర్ వీల్స్ పట్టుకుని గాల్లో తేలుతూ కనిపించారు. ఆ వీడియో చూసిన అభిమానులు బ్రిలియన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అంటూ తెగ ముచ్చటపడుతున్నారు. ప్రస్తుతం సోనూసూద్.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ట్వీట్..

Also Read: Jagapathi Babu: లెజెండ్ సినిమాలో నాకు అన్యాయం జరిగింది.. జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్…

NET Trailer Review: ఆద్యంతం ఆసక్తికరంగా అవికా గోర్ నెట్ ట్రైలర్..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ సీజన్ 5 షోకి రంగం సిద్ధం.. నేటి నుంచి క్వారంటైన్‌లో సభ్యులు.. అలరిస్తున్న ప్రోమో

Follow Us