‘చంద్రముఖి 2’ లో సిమ్రాన్..క్లారిటీ ఇచ్చిన న‌టి..

| Edited By: Pardhasaradhi Peri

Jun 03, 2020 | 4:47 PM

'చంద్రముఖి 2' స్వీక్వెల్​లో నటి సిమ్రాన్‌ నటించనుందనే వార్తలు వినిపించాయి. తాజాగా వాటిపై స్పందించింది ఈ అందాల తార‌.

చంద్రముఖి 2 లో సిమ్రాన్..క్లారిటీ ఇచ్చిన న‌టి..
Follow us on

రజనీకాంత్‌, జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి’. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. క‌లెక్ష‌న్లు అయితే అదిరిపోయాయి. అయితే త్వరలోనే ‘చంద్రముఖి 2’ తెరకెక్కించే పనిలో బిజీగా ఉంది మూవీ యూనిట్. రాఘవ లారెన్స్​ ఇందులో యాక్ట్ చేస్తున్నాడు. ఈ స్వీక్వెల్​లో నటి సిమ్రాన్‌ నటించనుందనే వార్తలు వినిపించాయి. తాజాగా వాటిపై స్పందించింది ఈ అందాల తార‌. అవన్నీ రూమ‌ర్స్ అని స్పష్టం చేసింది. క్లారిటీ లేక‌పోతే ఇటువంటి వార్తలను రాయకుండా ఉండాల‌ని కోరింది.

1997లో విడుదలైన ‘వి.ఐ.పి’ అనే తమిళ మూవీతో హీరోయిన్ గా వెండితెర ఎంట్రీ ఇచ్చింది సిమ్రాన్​. ఫ‌స్ట్ మూవీతోనే ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్‌ అవార్డును సొంతం చేసుకుంది. అదే ఏడాది తెలుగులో విడుదలైన ‘అబ్బాయి గారి పెళ్లి’లో నటించి టాలీవుడ్​లో కూడా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌, మహేశ్‌బాబుతో కూడా ఆమె ఆడిపాడింది.