Shruti Haasan: ప్రభాస్ అలా ఉంటారని నేను అస్సలు అనుకోలేందంటున్న శృతిహాసన్..

అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ అమ్మడు

Shruti Haasan: ప్రభాస్ అలా ఉంటారని నేను అస్సలు అనుకోలేందంటున్న శృతిహాసన్..
Shruti Haasan

Edited By:

Updated on: Apr 25, 2021 | 8:42 AM

Shruti Haasan: అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ అమ్మడు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో సినిమాలు చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శృతి ఆతర్వాత  స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. ఆతర్వాత సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చి ఇటీవలే మాస్ రాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చింది. క్రాక్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది శృతి. ఇదిలా ఉంటే ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ తో జత కడుతుంది ఈ బ్యూటీ.

ప్రభాస్ హీరోగా ‘సలార్’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే.  కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ నిర్మితమవుతోంది. దాంతో ఈ సినిమాలో హీరోయిన్ గా  అవకాశాన్ని దక్కించుకోవడానికి చాలామంది అందగాతెలు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. చివరకు ఆవకాశం శృతి కి దక్కింది. ప్రభాస్తో శృతిహాసాన్ నటిస్తున్న మొదటి సినిమా ఇది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ.. అంతటి క్రేజ్ ఉన్నప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటారు. అయన అంత సింపుల్ గా ఉంటారని నేను అనుకోలేదు.అందరితో  ఆయన చాలా ప్రేమతో మాట్లాడతారు .. ప్రభాస్ సెట్లో ఉన్నంత సేపు సందడిగా ఉంటుంది. తాను ఒక పెద్ద స్టార్ ను అనే విషయాన్ని ఆయన పూర్తిగా పక్కన పెట్టేస్తారు ప్రభాస్  ఆయనతో కలిసి నటించడం ఎవరికైనా కంఫర్ట్ గానే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hari Teja: పెళ్లి రోజున త‌న చిన్నారిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన హ‌రితేజ‌.. భ‌ర్త‌, కూతురుతో క‌లిసి దిగిన‌..

Anupama: త‌న‌ విస్కీ బేబీకి నాలుగేళ్లు నిండిన సంద‌ర్భంగా.. ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌..

కరోనా నుంచి కోలుకున్న రియల్ హీరో.. నెగిటివ్ అంటూ పాజిటివ్‏ షేడ్‏లో చెప్పిన సోనూ సూద్..