స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మరోసారి బ్రేకప్ చెప్పేసారా..? పెళ్లి ఖాయం అనుకుంటున్న తరుణంలో.. రెండోసారి ప్రేమలో ఓడిపోయారా..? కొత్త బాయ్ ఫ్రెండ్‌తోనూ లవ్ జర్నీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయిందా..? కమల్ హాసన్ కూతురుకు రియల్ లైఫ్‌లో ప్రేమ అచ్చి రావట్లేదా..? ఆమె లవ్ బ్రేకప్ స్టోరీలో నిజం ఎంత..? ఈమె మళ్లీ ఒంటరైపోయారా..? అనే డౌట్స్ వస్తున్నాయి. సినిమాలున్నా లేకపోయినా కొందరు హీరోయిన్లు మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటారు. శృతి హాసన్ అదే జాబితాలోకి వస్తుంటారు. తాజాగా ఈమె నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు. దానికి కారణం ఆమె నటిస్తున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి సినిమాలు అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. ఈమె ట్రెండింగ్‌కు కారణం లవ్ బ్రేకప్.. ఈ గాసిప్‌తోనే అమ్మడు పేరు మార్మోగిపోతుంది.
కొన్నేళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతన హజారికాతో డేటింగ్ చేస్తున్నారు శృతి హాసన్. ఈ ఇద్దరూ తమ రిలేషన్‌ను ప్రపంచానికి చెప్పారు కూడా. అయితే కొన్ని రోజులుగా ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు వస్తున్న సమయంలో.. తాజాగా శృతి పెట్టిన ఒక్క పోస్టుతో బ్రేకప్ రూమర్ గుప్పుమంది. ‘నాతో నేను సరదాగా ఉంటాను.. నాలా నేను.. నాతో నేను ఉంటే బాగుంటాను.. నా లైఫ్ నేనే ఇష్టపడతాను’ అంటూ నేను పురాణం చదివారు శృతి హాసన్.
నేను.. నా జీవితం అంటూ రాసుకోవడంతో శాంతనుతో బ్రేకప్ అయిపోయిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈయన కంటే ముందు ఫారెన్ సింగర్ మైఖెల్ కోర్సలేతో కొన్నేళ్లు ప్రేమలో ఉన్నారు శృతి. ఇద్దరూ పెళ్లికి రెడీ అయ్యాక.. అనుకోకుండా విడిపోయారు. మైఖెల్‌తో బ్రేకప్ తర్వాత మూడేళ్లకు పైగా సినిమాలు చేయలేదు శృతి. తాజాగా మరో బ్రేకప్ అంటే.. ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. చూడాలిక.. ఏం జరగబోతుందో..?
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..