సీనియర్ హీరోయిన్ రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే అత్యున్నత స్థాయికి ఎదిగింది. ప్రపంచస్థాయిలో ఎన్నో అవార్డులను అందుకుంది. ఇప్పటికే పలు పుస్తకాలు రచించి రచయితగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎంట్రప్రెన్యుయర్, ప్రోగ్రామర్గానూ రాణిస్తోంది. ఇటీవలే ప్రముఖ ఇన్ల్ఫూయేన్సర్.. యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై కూడా ఆమె ఫోటోను ప్రచురించారు. అలాగే ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. సమాజ సేవలో తనవంతు కృషి చేస్తున్న అన్షు త్వరలోనే సినీరంగ ప్రవేశం చేయనున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం కాబోతుందంటూ టాక్ వినిపించింది. కానీ ఈ రూమర్స్ పై నటి రోజా స్పందించలేదు. తాజాగా తన కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతు భావోద్వేగ పోస్ట్ చేసింది రోజా.
సెప్టెంబర్ 10 అన్షు మాలిక పుట్టినరోజు. ఈ సందర్భంగా రోజా తన ఇన్ స్టా వేదికగా అన్షు చిన్ననాటి నుంచి ప్రస్తుతం వరకు ఫోటోస్ షేర్ చేస్తూ విషెష్ తెలిపింది. ” డియర్ అన్షు. నువ్వు నా కూతురివి మాత్రమే కాదు.. మంచి స్నేహితురాలివి కూడా. నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు థాంక్స్. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్షు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రతిసారీ తన పిల్లల బర్త్ డే వేడుకలను ఎంతో గ్రాండ్ గా సెలబ్రెట్ చేస్తుంటారు రోజా. కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతుంటారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.