Rajendra Prasad: హిట్ కాకపోతే మీ ముందు నిలబడను.. రాజేంద్రప్రసాద్ ఆసక్తకికర వ్యాఖ్యలు..

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. ఎఫ్ 2ను మించిన కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

Rajendra Prasad: హిట్ కాకపోతే మీ ముందు నిలబడను.. రాజేంద్రప్రసాద్ ఆసక్తకికర వ్యాఖ్యలు..
Rajendra Prasad

Updated on: May 22, 2022 | 12:38 PM

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ సినిమా ఎఫ్ 3. ఇందులో తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా కీలకపాత్రలలో నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. ఎఫ్ 2ను మించిన కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ షూరు చేశారు మేకర్స్. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ శిల్పాకళా వేదికలో ఏర్పాటు చేసిన ఎఫ్ 3 ఫంటాస్టిక్ ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ” మనకు నవ్వు ఎంత ముఖ్యమనేది ఎఫ్ 3 సినిమా తెలియజేస్తుంది.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కావాల్సినంత నవ్వులను పంచే సినిమా ఇదే.. ఎఫ్ 3 సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఈ సినిమా హిట్ కాకపోతే.. గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నా మళ్లీ మీ ముందు నేను ఎప్పుడు నిలబడను.. ఈ సినిమాలోని అన్ని పాత్రలు 100 శాతం ప్రేక్షకులను నవ్విస్తాయి..ఎఫ్ 3 చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూసి.. సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

Loading...
Unable to load recommendations.
Follow Us