ఆ హీరోయిన్ మద్యం తాగదు.. కానీ ఆమెకు ఉన్న అలవాటు ఇదే.. అసలు విషయం బయటపెట్టిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తిరిగి సినిమాల్లో బిజీ అవుతుంది. సమంత ఇటీవలే నిర్మాతగా మారింది. రీసెంట్ గానే శుభం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఏలింది సమంత.. ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్ గా సమంతానే ఉండేది.

పెళ్లి తర్వాత సమంత సినిమాల స్పీడ్ తగ్గించింది. ఎప్పుడైతే మాయోసైటిస్ బారిన పడిందో అప్పటి నుంచి సమంత సినిమాలు తగ్గించేసింది. మయోసిటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఏడాది గ్యాప్ తీసుకుంది. ఏడాది పాటు సినిమాలకు దూరం ఉండి మానసిక ప్రశాంతతను పొంది.. ఇప్పుడు తిరిగి సినిమాల పై ఫోకస్ పెడుతుంది. అంతే కాదు ఇటీవలే నిర్మాత రాజ్ ను వివాహం చేసుకొని కొత్తజీవితాన్ని ప్రారంభించింది సామ్. ఒక వైపు హీరోయిన్ గా సినిమాలు లైనప్ చేస్తూనే ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు చేస్తుంది సామ్. మొన్నామధ్య శుభం అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత ఓ హీరోయిన్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
నాకు బ్రేకప్ అయ్యింది.. మా అమ్మకు కూడా అది తెలుసు.. షాకింగ్ విషయం చెప్పిన కృతిశెట్టి
సమంత, కీర్తిసురేష్ మంచి ఫ్రెండ్స్.. ఈ ఇద్దరూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు. ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. తెలుగు కీర్తిసురేష్ వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. తెలుగుతో పాటు, తమిళ సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే ఈ అమ్మడు మొన్నామధ్య హిందీలోనూ అడుగుపెట్టింది. కానీ హిందీలో చేసిన ఒకే ఒక్క సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా సమంత కీర్తిసురేష్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!
రీసెంట్ గా కీర్తిసురేష్ కు మద్యం తాగే అలవాటు ఉందని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలోనూ కీర్తి గురించి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటి పై సమంత స్పందించింది. కీర్తిసురేష్ గు మద్యం తాగే అలవాటు లేదు.. కానీ ఆమెకు మరో అలవాటు ఉంది.. అదేంటంటే హైపర్ మ్యాక్ . ఎక్కువగా ఇతరులను నవ్వించే అలవాటు. అలాగే ఒక్కసారి మాట్లాడితే కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటారు. అలాగే కీర్తి అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ నవ్విస్తూనే ఉంటుందని, రైమింగ్ తో మాట్లాడుతూ ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
హీరో లేడు.. ఫైట్స్, స్పెషల్ సాంగ్స్ లేవు..! కట్ చేస్తే నాలుగేళ్లుగా ఓటీటీలో తిరుగులేని సినిమా
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




