Samantha Ruth Prabhu: బన్నీ కూర్చోబెట్టి ఆ విషయం చెప్పాడు.. స్పెషల్ సాంగ్ గురించి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..

| Edited By: Shaik Madar Saheb

Jan 14, 2022 | 6:51 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

Samantha Ruth Prabhu: బన్నీ కూర్చోబెట్టి ఆ విషయం చెప్పాడు.. స్పెషల్ సాంగ్ గురించి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..
మాతృత్వం గురించి సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Follow us on

Samantha Ruth Prabhu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. మునుపెన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించాడు బన్నీ. ఇక మొదటి పార్ట్ కే విపరీతమైన రెస్పాన్స్ రావడంతో పార్ట్ 2 పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో విపరీతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది పుష్ప. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బన్నీ నటనకు విమర్శకుల ప్రసంశలు దక్కుతున్నాయి. ఇక సినిమా తారలు కూడా బన్నీ నటనను తెగ పొగిడేస్తున్నారు.ఇక ఈ సినిమాలో అందాల భామ సమంత స్సెషల్ సాంగ్ లో మెరిసిన విషయం తెలిసిందే.

ఇక సమంత చేసిన ఈ సాంగ్ సినిమాకు ఒక హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఎక్కడ విన్న ఈ పాట మారుమ్రోగుతుంది. ‘ఊ అంటావా మావ’ అంటూ సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తుంది. సమంత ఇంతవరకు స్పెషల్ సాంగ్స్ లో నర్తించలేదు. మొదటిసారి ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేయడంతో అందరు ఆశ్చర్య పోతున్నారు. దానికి కారణం బన్నీనే అంటోంది సమంత. ఆ పాట చేయడానికి ముందు తాను భయపడ్డానని చెప్పింది సమంత. చేయాలా? వద్దా? ఉన్న తనకు.. బన్నీనే స్ఫూర్తినిచ్చాడని తెలిపింది. ఆ పాటలో నటిస్తే ఎంత పేరొస్తుందో కూర్చోబెట్టి చెప్పాడని, దీంతో తాను ఒప్పుకొన్నానని చెప్పుకొచ్చింది

మరిన్ని ఇక్కడ చదవండి : 

Balakrishna: ఏపీ సినిమా టికెట్స్ రేట్స్ వివాదంపై స్పందించిన బాలకృష్ణ.. ఏమన్నారంటే..

Radhe Shyam: ‘ఇలా అన్నారంటే వచ్చి కొడతా’.. ప్రభాస్ అభిమానికి ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ స్వీట్ వార్నింగ్..

Ala Vaikuntapuramuloo: బన్నీకి ఈరోజు చాలా స్పెషల్.. ఫ్యాన్స్‏కు థాంక్స్ చెబుతూ స్పెషల్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్