AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే నేను పెళ్లి చేసుకోవడం లేదు.. మొత్తానికి అసలువిషయం బయట పెట్టిన సల్మాన్ ఖాన్

‘బీవీ హో తో ఏసీ’ సినిమాలో చిన్న పాత్రతో పరిచయం అయ్యాడు సల్మాన్. అయితే ‘మేనే ప్యార్ కియా’ సినిమా ఆయనకు విజయాన్ని అందించింది. బుల్లితెరలో కూడా నటించాడు సల్మాన్. ఇప్పుడు సల్మాన్ బాలీవుడ్ లో తోపు హీరో. సల్మాన్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ఉంది.

అందుకే నేను పెళ్లి చేసుకోవడం లేదు.. మొత్తానికి అసలువిషయం బయట పెట్టిన సల్మాన్ ఖాన్
Salman Khan
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2025 | 2:44 PM

Share

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ . సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. 58 ఏళ్ల వయసులో కూడా సల్మాన్ ఖాన్ ఒంటరిగా జీవిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. సల్మాన్ ఖాన్ జీవితంలోకి చాలా మంది అమ్మాయిలు ఉన్నారు.. సల్మాన్ ఖాన్ లిస్ట్ లో.. సంగీతా బిజ్లానీ, ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. ఈ స్టార్స్‌తో సల్మాన్ డేటింగ్ చేశాడు.

ఇది కూడా చదవండి : దీన స్థితిలో టాలీవుడ్ కమెడియన్..! నీ ముఖం కూడా గుర్తులేదంటూ అవమానాలు

59ఏళ్లు వచ్చినా కూడా సల్మాన్ ఖాన్ పెళ్లికి మాత్రం దూరంగా ఉంటున్నాడు. తాజాగా సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోపోవడానికి కారణం తెలిపాడు. ఇటీవల కపిల్ శర్మ షో కు గెస్ట్ గా హాజరయ్యాడు సల్మాన్ ఖాన్. ఈ కార్యక్రమాల్లో సల్మాన్ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “ఈ వయసులో పెళ్లి చేసుకుని భార్యతో గొడవలు పడలేను. విడాకులొస్తే భార్యకి సగం ఆస్తి ఇవ్వాలి. నేనెంతో కష్టపడి సంపాదించుకున్నఆస్తి కోల్పోవడం నాకిష్టం లేదు. అందుకే నేను పెళ్లి చేసుకోవడం లేదు” అని సరదాగా అన్నారు సల్మాన్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : 400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?

సల్మాన్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ఉంది. అతని నికర విలువ రూ. 2900 కోట్ల రూపాయలు. సల్మాన్ ఖాన్ హీరోగానే కాదు.. చాలా బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉన్నారు. బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ సల్మాన్ ఖాన్ సొంత బ్రాండ్. అతను 2013 లో ఈ బ్రాండ్‌ను ప్రారంభించాడు. దీని ద్వారా సల్మాన్ చారిటబుల్ ట్రస్ట్‌కు సహాయం చేస్తున్నాడు. దీని ద్వారా ఎంతో మందికి సాయం అందించాడు సల్మాన్. కాగా సల్మాన్‌ఖాన్‌ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెడతాడు. అతను ఫిట్‌నెస్ సెంటర్స్ కూడా ప్రారంభించాడు. ఇది భారతదేశం అంతటా 300 కంటే ఎక్కువ బ్రాంచ్ లు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. దీని కోసం వారు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు. సల్మాన్‌ఖాన్‌కి ‘సల్మాన్‌ఖాన్‌ ఫిలిమ్స్‌’ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఈ బ్యానర్ పై ‘బజరంగీ భాయిజాన్’, ‘రేస్ 3’, ‘ట్యూబ్‌లైట్’, ‘భారత్’ వంటి చిత్రాలను నిర్మించాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి మరీ అడిగాడు..
ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి మరీ అడిగాడు..
ఐడియా అదిరింది గురూ.. 50ఏళ్లుగా గ్యాస్ లేకుండానే నడుస్తున్న హోటల్
ఐడియా అదిరింది గురూ.. 50ఏళ్లుగా గ్యాస్ లేకుండానే నడుస్తున్న హోటల్
మీ ఏజ్ ప్రకారం బాడీలో ఎంత కొవ్వు ఉండాలి..? అసలు నిజం తెలిస్తే..
మీ ఏజ్ ప్రకారం బాడీలో ఎంత కొవ్వు ఉండాలి..? అసలు నిజం తెలిస్తే..
ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. IMDBలోనూ టాప్
ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. IMDBలోనూ టాప్
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
వామ్మో.. పుట్టగొడుగులో ఆ భాగం తినకూడదా? కారణం తెలిస్తే..
వామ్మో.. పుట్టగొడుగులో ఆ భాగం తినకూడదా? కారణం తెలిస్తే..
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి
పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి
మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా?
మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా?
జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీమంత్రి కీలక వ్యాఖ్యలు
జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీమంత్రి కీలక వ్యాఖ్యలు