Roshan Meka: ఛాంపియన్ హిట్ జోష్‌లో యంగ్ హీరో.. క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్! జానర్‌‌ ఏంటో తెలిస్తే మతిపోతుంది

టాలీవుడ్ లో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించి, ఇప్పుడు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతున్న ఆ యంగ్ హీరో.. ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారారు. మొదటి నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, తన నటనలో పరిణతి చూపిస్తున్న ఆయన.. ఇటీవల ఒక భారీ పీరియడ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Roshan Meka: ఛాంపియన్ హిట్ జోష్‌లో యంగ్ హీరో.. క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్! జానర్‌‌ ఏంటో తెలిస్తే మతిపోతుంది
Roshan Meka

Updated on: Feb 08, 2026 | 12:18 PM

ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఒక నటుడిగా ఆయనకు వంద మార్కులు పడ్డాయి. అయితే ఇప్పుడు ఆ హీరో తన రూట్ మార్చి పూర్తిస్థాయి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ వైపు అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరున్న ఒక దర్శకుడు, అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న ఒక బడా ప్రొడక్షన్ హౌస్ ఈ యంగ్ హీరోకు తోడవ్వబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు?

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేకా.. తన కెరీర్‌ను ఎంతో నెమ్మదిగా, ధృడంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తాజాగా విడుదలైన ‘చాంపియన్’ సినిమా తర్వాత రోషన్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఒక కొత్త తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమాలో హీరోగా నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా యువతరానికి నచ్చే ఒక స్వచ్ఛమైన ప్రేమకథతో సాగుతుందని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. సీరియస్ పాత్రల నుంచి లైట్ హార్టెడ్, యూత్‌ఫుల్ పాత్రల వైపు రోషన్ మారుతుండటం విశేషం.

క్రేజీ ప్రాజెక్ట్..

ఈ చిత్రానికి ‘హిట్’ సిరీస్‌తో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించబోతున్నారు. క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి విరామం తీసుకుని ఆయన మొదటిసారి ఒక లవ్ స్టోరీని టచ్ చేయబోతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రముఖ నిర్మాత నాగ వంశీ తన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీగా నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘మిరాయ్’ బ్యూటీ ప్రీతి ముఖుందన్ నటించనున్నారని సమాచారం. చాంపియన్ తర్వాత రోషన్ కెరీర్‌లో ఇది ఒక కీలకమైన మలుపు కానుంది.

Roshan And Sailesh

రోషన్ మేకా చివరిగా ‘చాంపియన్’ సినిమాలో హీరోగా కనిపించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ డ్రామాలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయినా, రోషన్ నటనకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఒక పీరియడ్ డ్రామాలో అంతటి ఇంటెన్స్ ఉన్న పాత్రను పోషించినందుకు రోషన్ ను అందరూ మెచ్చుకున్నారు.

చాంపియన్ సినిమా తర్వాత రోషన్ ను పలువురు ప్రముఖ దర్శకులు సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రోషన్‌ను కలిసి అభినందించారట. దీంతో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రోషన్ ఒక సినిమా చేసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దాదాపు పదేళ్ల తర్వాత ఒక తెలుగు సినిమా ప్లాన్ చేస్తున్నారు.

అందులో రోషన్‌ను హీరోగా తీసుకోవాలని ఆయన భావిస్తున్నారట. గౌతమ్ మీనన్ మార్కు రొమాంటిక్ మూవీలో రోషన్ నటిస్తే ఆయన ఇమేజ్ మరో స్థాయికి చేరుకోవడం ఖాయం. వరుస అవకాశాలతో రోషన్ మేకా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా మారుతున్నారు. శైలేష్ కొలను సినిమాతో పాటు గౌతమ్ మీనన్ ప్రాజెక్ట్ కూడా ఓకే అయితే రోషన్​ కెరీర్​ గాడిలో పడినట్లే అంటున్నారు అభిమానులు.