RGV: తెలంగాణ పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి స్వర్గానికి వెళ్తారా.? ఆర్జీవీ సెటైర్లు

|

Dec 20, 2024 | 5:27 PM

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలతోనే కాదు వివాదాలతోనూ ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే ఆయన అరెస్ట్ వరకు వెళ్లి వెనక్కి వచ్చారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్మ. రెగ్యులర్ గా ఎదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఉంటారు వర్మ. తాజాగా ఆయన అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు.

RGV: తెలంగాణ పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి స్వర్గానికి వెళ్తారా.? ఆర్జీవీ సెటైర్లు
Rgv
Follow us on

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. వివాదం లేకుండా ఉండలేరు. ఆయన ఏం చేసిన అది సంచలనం గా మారిపోతుంది. సినిమాలతో పాటు ఆయన చేసే కామెంట్స్ ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్న రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ పోలీసులను ఉద్దేశించి వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాగా అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంద్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా పోలీసులు కేసు నమోస్ చేశారు.

ఇది కూడా చదవండి :అప్పుడు బాడీ షేమింగ్ అవమానాలు.. ఇప్పుడు నోరెళ్ళబెట్టి చూసే సోయగం.. స్టార్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ

పోలీసులు అరెస్ట్ చేసి అల్లు అర్జున్ ను జైల్లో కూడా పెట్టారు. ఒక్క రాత్రి అల్లు అర్జున్ ను జైల్లో ఉంచారు పోలీసులు ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు అల్లు అర్జున్. దీని పై రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. ఎక్స్ లో రామ్ గోపాల్ వర్మ ఇలా రాసుకొచ్చాడు. ప్రతి స్టార్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ కు వ్యతిరేకంగా తీవ్రంగా నిరసన తెలపాలి అని అల్లు అర్జున్ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Venu Swamy: నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం మొదలయ్యింది.. ఇంకా జరుగుతాయి

“సినిమా వాళ్ళందరూ అల్లు అర్జున్ అరెస్ట్ కు నిరసన తెలపాలి. ఎందుకంటే ఏ సెలబ్రిటీ అయినా అది సినిమా స్టార్ అయినా, పొలిటికల్ స్టార్ అయినా సరే, వారు గొప్పగా పాపులర్ అవ్వడం నేరమా.? నా క్షణం సినిమా షూటింగ్‌లో శ్రీదేవిని చూసేందుకు వచ్చిన లక్షలాది మంది జనంలో ముగ్గురు చనిపోయారు. అయితే తెలంగాణ పోలీసులు ఇప్పుడు శ్రీదేవిని అరెస్ట్ చేయడానికి  స్వర్గానికి వెళ్తారా.? అని రామ్ గోపాల్ వర్మ ఎక్స్ (ట్విట్టర్)లో రాసుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.

ఇది కూడా చదవండి : Rajamouli: రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. అది కూడా రెమ్యునరేషన్ కోసం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.