Akira Nandan: అకీరా చేసిన మంచి పనికి ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటో..

Renu Desai:  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకీరా నందన్ (Akira Nandan) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Akira Nandan: అకీరా చేసిన మంచి పనికి ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటో..
Akira Nandan
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 23, 2022 | 7:39 AM

Renu Desai:  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకీరా నందన్ (Akira Nandan) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రిలాగే బాక్సింగ్‌, కరాటే లాంటి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటోన్న ఈ స్టార్‌ కిడ్‌కు సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ భారీగానే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మొదటి సారి రక్తదానం చేశాడు అకిరా నందన్‌. ఈ విషయాన్ని అతడి తల్లి రేణు దేశాయ్‌ (Renu Desai) సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ తో పంచుకుంది. ’18 ఏళ్లు నిండిన తర్వాత అకీరా చేసిన మొదటి రక్తదానం. అవసరంలో ఉన్నవారికి మనం ఇచ్చే అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే అది మన రక్తం. దయచేసి మీకు 18 ఏళ్లు నిండిన తర్వాత మీకు వీలైనంత వరకు రక్తదానం చేయండి. దాని ద్వారా మీరు ఎవరో ఒకరి ప్రాణాలని కాపాడినవారవుతారు’ అని ఆ పోస్టులో రాసుకొచ్చింది రేణు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అకీరా మంచి పని చేశాడంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కరిపిస్తున్నారు.

అకీరాతో పాటు కూతురు ఆద్య ఫొటోలు, యాక్టీవిటీస్‌ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది రేణు దేశాయ్‌. వీటికి అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈక్రమంలో ఇటీవల తన పుట్టిన రోజును బాక్సింగ్‌ వీడియో షేర్‌ చేయడంతో అకీరా సినిమాల్లోకి వస్తున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే వాటిని ఖండించిన రేణు అకీరా సినిమాల్లోకి రావడం లేదని స్పష్టం చేసింది.

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

Also Read: KTR: తెలంగాణలో అప్పుల కంటే మిగులు ఆదాయమే ఎక్కువ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Andhra Pradesh Politics: 2024 ఎన్నికలే టార్గెట్‌గా రంగంలోకి చంద్రబాబు.. సీనియర్లకు వార్నింగ్స్..!

Acharya: ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్.. రేపు యూసఫ్ గూడ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Latest Articles