ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ తెగ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. స్టార్స్ చిన్నప్పటి ఫోటోస్ చూసేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అంతలోనే ఇండస్ట్రీకి దూరమైన తారలు ఇప్పుడు నెట్టింట యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో ఆ సెలబ్రెటీలు ఇప్పుడేం చేస్తున్నారు..? ఎలా ఉన్నారు అనే విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే తెగ వినిపిస్తున్న పేరు సనోబర్ హెరేకర్. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టరు కానీ.. భద్ర మూవీ సత్య అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఒక్క సినిమాతోనే పాపులారిటీని సొంతం చేసుకుంది. మాస్ మాహారాజా రవితేజ కెరీయర్లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న చిత్రాల్లో భద్ర ఒకటి. రవితేజ కెరీర్ మలుపు తిప్పిన ఈ సినిమాకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది.. మొదటి సినిమాకే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బోయపాటి. ఇందులో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించగా.. మురళి మోహన్, సునీల్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో నటించారు. ఇందులో రవితేజ యాక్టింగ్.. బోయపాటి డైరెక్టన్ మాత్రమే కాకుండా.. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్. బ్లాక్ బస్టర్ హిట్ కాకుండా మ్యూజికల్ హిట్ కూడా. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో తన కామెడీతో ప్రేక్షకులను కడపుబ్బా నవ్వించాడు సునీల్. ఈ మూవీలో సునీల్ ప్రేమను ఓ ఆటాడుకున్న అమ్మాయి సత్య. ఇందులో సునీల్, సత్య మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇందులో సత్య పాత్రలో నటించిన హీరోయిన్ పేరు సనోబర్ హెరేకర్.
ఈ సినిమాతో సత్య పాత్రలో నటించి బాగా పాపులర్ అయ్యింది. కానీ భద్ర సినిమా తర్వాత సనోబర్ మరో చిత్రంలో కనిపించలేదు. సినిమా వచ్చి దాదాపు 18 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ మరో సినిమా చేయలేదు సనోబర్. కానీ అటు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది ఈ బ్యూటీ. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సనోబర్.. కొన్నాళ్లక్రితం పలు హిందీ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. అజీజ్ జీ అనే ఆర్టిస్ట్ ను పెళ్లి చేసుకున్న సనోబర్ హెరేకర్.. ఇప్పుడు వ్యాపారరంగంలో రాణిస్తున్నారు. అలాగే ఈ బ్యూటీకి బైక్ రైడింగ్ అంటే ఇష్టమున్నట్లు ఇన్ స్టా వీడియోస్ చూస్తే తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.