
భోజ్ పురి సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా వెలుగొందుతున్నారు రవి కిషన్. అలాగే ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగానూ సేవలు అందిస్తున్నారీ నటుడు. తెలుగులోనూ రవికిషన్ కు మంచి గుర్తింపు ఉంది. అల్లు అర్జున్ రేసు గుర్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారాయన. కిక్ 2, రాధే, సుప్రీమ్, ఎమ్మెల్యే, లై, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయాకుడు, 90 ఎంఎల్, డాకూ మహరాజ్, రీసెంట్ గా రామ్ చరణ్ ‘పెద్ది’లోనూ ఓ కీలక పాత్రలో నటించారు రవి కిషన్. సినిమాల సంగతి పక్కన పెడితే రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు రవి కిషన్. 2019 సాధారణ ఎన్నికల్లో గోరఖ్ పూర్ ఎంపీగా ఘన విజయం సాధించి పార్లమెంట్ లోకి అడుగు పెట్టారీ నటుడు. ఇక 2024 జనరల్ ఎలక్షన్స్ లో నూ భారీ మెజారిటీతో మళ్లీ గెలుపొందారాయన. ఇలా ఓ వైపు సినిమాలు చేస్తూన మరోవైపు పార్లమెంట్ సభ్యునిగా ప్రజలకు సేవ చేస్తున్నారీ ట్యాలెంటెడ్ యాక్టర్.
కాగా రవి కిషన్ భార్య పేరు ప్రీతిశుక్లా. 1993లో వీరి వివాహం జరిగింది. వీరికి మొత్తం నలుగురు సంతానం. ఒకరు కుమారుడు కాగా మరో ముగ్గురు కూతుర్లు. అయితే ఇందులో ఒక కూతురు ఇషితా శుక్లా సినిమా ఇండస్ట్రీని కాదని విభిన్నమైన కెరీర్ ఎంచుకుంది. తండ్రిలా కాకుండా మరో డిఫరెంట్ కెరీర్‌ను ఎంచుకుంది. చిన్నప్పటి నుంచే ఆర్మీలో పని చేయాలని కలలు కన్న ఇషితా స్కూల్ అండ్ కాలేజ్ డేస్ లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ)లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది. ఈ క్రమంలోనే 2023లోనే ఇషితా అగ్నివీర్‌గా చేరినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే సైనిక శిక్షణ పొందిన ఈ స్టార్ కిడ్ ఢిల్లీ డైరెక్టరేట్‌కు చెందిన 7 గర్ల్స్ బెటాలియన్‌లో పనిచేసింది. అలాగే కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ పరేడ్ లోనూ పాల్గొంది.
దేశానికి సేవ చేయడమేనంటూ ముందుకు సాగుతోన్న ఇషితా నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అలాగే హీరో మాధవన్ కూడా కూడా ఇషితాను ప్రస్తావిస్తూ తెగ మెచ్చుకున్నారు. దీంతో రవికిషన్ కూతురు పేరు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ మార్మోగుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.