Jani Master: జానీ మాస్టర్‌ షాక్ ఇచ్చిన కోర్టు.. బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం

|

Oct 14, 2024 | 7:03 PM

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. పోక్సో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్‌ను వరించిన నేషనల్‌ ఫిలిం అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ కొరియోగ్రఫీ-2022ను కమిటీ నిలిపివేసింది. ధనుష్‌ నటించిన తిరుచిట్రంబలం సినిమాకు గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌ నేషనల్‌ అవార్డ్‌కు ఎంపికయ్యారు.

Jani Master: జానీ మాస్టర్‌ షాక్ ఇచ్చిన కోర్టు.. బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం
Jani Master
Follow us on

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ కోర్టు షాక్ ఇచ్చింది. తాజాగా జానీ మాస్టర్ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది రంగారెడ్డి కోర్టు. ఇటీవల జానీ మాస్టర్‌ నేషనల్ అవార్డు తీసుకునేందుకు కోర్టు అక్టోబర్‌ 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్న కారణంగా జానీకి అవార్డును కేంద్రం రద్దు చేసింది. ఈ కేసులో జానీ ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ను ఇచ్చేందుకు నిరాకరించింది.

ఇది కూడా చదవండి : ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. కానీ ఓటీటీలోకి..

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. పోక్సో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్‌ను వరించిన నేషనల్‌ ఫిలిం అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ కొరియోగ్రఫీ-2022ను కమిటీ నిలిపివేసింది. ధనుష్‌ నటించిన తిరుచిట్రంబలం సినిమాకు గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌ నేషనల్‌ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ నెల 8న ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో అవార్డ్‌ అందుకోవాల్సి ఉంది. దాంతో.. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయి జైల్లో ఉన్న జానీ మాస్టర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. నేటి నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు బెయిల్‌ మంజూరుకు ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో.. ఢిల్లీ వెళ్లి అవార్డ్‌ అందుకునేందుకు రెడీ అయ్యారు. కానీ.. పోక్సో కేసు నమోదుతో జానీమాస్టర్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఆయనకు ప్రకటించిన నేషనల్‌ బెస్ట్‌ కొరియోగ్రఫీ అవార్డును కమిటీ హోల్డ్‌లో పెట్టింది.

ఇది కూడా చదవండి : ఏంటి భయ్యా ఈ అమ్మడు.. మరీ ఇంత బాగుంది..! మహేష్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే

ఇక.. అసిస్టెంట్‌ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో గత నెల 19న జానీ మాస్టర్‌ అరెస్ట్‌ అయ్యారు. జ్యూడీషియల్‌ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. అయితే.. నేషనల్‌ అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రంగారెడ్డి జిల్లా కోర్టు జానీమాస్టర్‌కు బెయిల్‌ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దాంతో.. జానీమాస్టర్‌కు కొంత ఊరట లభించిందని అందరూ భావించారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అవార్డ్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి : ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. కానీ ఓటీటీలోకి..

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్‌లో ఉండడంతో ఆయనకు ప్రకటించిన అవార్డ్‌ను నిలిపివేసినట్లు లేఖ రిలీజ్‌ చేసింది కమిటీ. ఎల్లుండి ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డ్‌ అందుకోవడానికి అనర్హుడిగా భావిస్తు్న్నట్లు లేఖలో తెలిపింది. దాంతో.. జానీ మాస్టర్‌తోపాటు ఆయన ఫ్యాన్స్‌ షాక్‌కు గురయ్యారు. నేషనల్‌ అవార్డ్‌ను కమిటీ నిలిపివేయడంతో జానీ మాస్టర్‌ బెయిల్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. జానీకి అవార్డ్‌ నిలిపివేసిన నేపథ్యంలో ఆయన బెయిల్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టు సోమవారం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.