Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది.. రామ్ చరణ్ నట విశ్వరూపం.. మెగా ఫ్యాన్స్‏కు పూనకాలే..

ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. జూన్ 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది.. రామ్ చరణ్ నట విశ్వరూపం.. మెగా ఫ్యాన్స్‏కు పూనకాలే..
Peddi Movie Trailer

Updated on: May 18, 2026 | 4:07 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకగా, జూన్ 4న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పెద్ది టీజర్, గ్లింప్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. మరోవైపు యూట్యూబ్ లో పెద్ది సాంగ్స్ మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి. రోజు రోజుకీ పెద్ది చిత్రంపై హైప్ తారాస్థాయికి చేరింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పక్కా ఊర మాస్ లుక్కులో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. మే 18న ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్.

ఎక్కువ మంది చదివినవి : Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. కాసేపటి క్రితం భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్ర అఫీషియల్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్ అభిమానులకు సరికొత్త మాస్ ఎంటర్టైన్మెంట్‌ను పరిచయం చేసింది. ‘పెద్ది’ ట్రైలర్‌లో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని రెండు భిన్నమైన గెటప్స్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1980ల నాటి రూరల్ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే ఈ కథలో చరణ్ ఒకవైపు విలేజ్ క్రికెటర్‌గా, మరోవైపు రగ్గడ్ లుక్‌లో భారీ కాయంతో ‘పెద్ది పహిల్వాన్’గా అద్భుతమైన వేరియేషన్స్ చూపించారు.

ఎక్కువ మంది చదివినవి : Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..

చరణ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ముఖ్యంగా ఆ ఊరమాస్ ఎలివేషన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ట్రైలర్‌లోని ప్రతి సీన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. విజువల్స్, ఎమోషన్స్, రెహమాన్ మార్క్ మ్యూజిక్ పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యాయి. వృద్ధి సినిమాస్ , మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ పాన్-ఇండియా చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

 ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు.. జగపతి బాబు..

పెద్ది మూవీ ట్రైలర్..

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..

Follow Us