PEDDI Mega Blockbuster Event: పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా చిరంజీవి…
భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న సినిమా పెద్ది. ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి థియేటర్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో చరణ్ యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ చూసి అడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్.
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో వచ్చిన లేటేస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పెద్ది. భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే పెద్ది సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్రయూనిట్.. ఇప్పుడు పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. హైదరాబాద్ లోని ప్రముఖ సాంస్కృతిక వేదిక శిల్పకళా వేదికలో ఈరోజు అంటే జూన్ 23 సాయంత్రం 6 గంటల నుండి ఈ ఈవెంట్ ప్రారంభం అయ్యింది. అలాగే ఈ సక్సెస్ సెలబ్రెషన్లలో చిరుతోపాటు చిత్రయూనిట్ సభ్యులు, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ సైతం పాల్గోంటున్నారు. ఈ వేడుకను మీరు టీవీ9 ప్రత్యేక్ష ప్రసారంలో చూడొచ్చు.
ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..
కథ విషయానికి వస్తే.. 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ (ఉత్తరాంధ్రా) నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఒక మారుమూల గ్రామానికి చెందిన ప్రతిభావంతుడైన అథ్లెట్/పహిల్వాన్ తన ఊరి గౌరవాన్ని కాపాడటానికి, ఒక శక్తివంతమైన ప్రత్యర్థిని ఎదుర్కొని స్పోర్ట్స్ ద్వారా తన గ్రామానికి ఎలా గుర్తింపు తెచ్చాడు అనేదే సినిమా మూలకథ. గ్రామీణ క్రీడలు, భావోద్వేగాలు, భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా తెరకెక్కించారు. రామ్ చరణ్ టైటిల్ రోల్ ‘పెద్ది’గా నటించగా, ‘అచ్చీయమ్మ’ పాత్రలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ (పెద్ది కోచ్‌గా), జగపతి బాబు (విలన్‌గా) పవర్ఫుల్ పాత్రల్లో కనిపించారు. వీరితో పాటు బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ, రవి కిషన్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..
ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఇప్పటికే పెద్ది చిత్రంపై సినీ ప్రముఖులు, విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విజయవంతంగా దూసుకుపోతుంది.
ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్..
ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..
ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్!
11 ఏళ్లకే యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డ్..
ఉద్యోగితో రూ. 2.5 లక్షల ఫిట్నెస్ బెట్ లో ఓడిన జెరోదా బాస్
ఫోన్ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో
వీడు మామూలోడు కాదు.. పగలు ఇళ్లకు రంగులు.. రాత్రయితే చాలు..
అంతరిక్షంలో వింత.. 'ఆ గ్రహం' పై ఉప్పు వర్షం..
టీచర్‌గా మారిన ఎస్పీ.. క్లాస్‌లో పాఠాలు చెబుతూ..

