Vettaiyan: చిక్కుల్లో రజినీకాంత్ సినిమా.. ‘వేట్టయాన్’ మూవీపై కోర్టులో కేసు.. ఎందుకంటే..

తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇందులో తలైవా లుక్, డైలాగ్స్, యాక్షన్ అదిరిందని.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు అంటూ సంతోషం వ్యక్తం చేశారు ఫ్యాన్స్.

Vettaiyan: చిక్కుల్లో రజినీకాంత్ సినిమా.. 'వేట్టయాన్' మూవీపై కోర్టులో కేసు.. ఎందుకంటే..
Vettaiyan
Follow us

|

Updated on: Oct 03, 2024 | 9:36 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ‘వేట్టయాన్’. జై భీమ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళీ బ్యూటీ మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 10న విడుదల కానుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇందులో తలైవా లుక్, డైలాగ్స్, యాక్షన్ అదిరిందని.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు అంటూ సంతోషం వ్యక్తం చేశారు ఫ్యాన్స్. కానీ తాజాగా ఈ మూవీ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాపై మధురై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇటీవల విడుదలైన వేట్టయాన్ టీజర్‏లో సంభాషణలు చట్టవిరుద్ధంగా ఎన్‏కౌంటర్ లను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని పేర్కొంటూ ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సినిమా విడుదల కాకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. సెప్టెంబర్ 20న వేట్టయాన్ ప్రివ్యూ పేరుతో చిత్రయూనిట్ టీజర్ ను విడుదల చేసింది. ఆ ప్రోమోలో ‘అత్యంత భయంకరమైన క్రిమినల్స్ ను ఏమాత్రం భయపడకుండా ఎన్ కౌంటర్ చేయడం వల్ల వీళ్లు హీరోలు అయ్యారు’ అంటూ కొన్ని సంభాషణలు ఉండటంపై సదరు పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

అవి చట్టవిరుద్ధ ఎన్ కౌంటర్స్ ప్రోత్సహించేలా ప్రజల ఆలోచనా దృక్పథాన్ని మార్చేలా ఉన్నాయన్నారు. ఆ సంభాషణలను తొలగించడం లేదా మ్యూజ్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు సదరు పిటిషనర్. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సుబ్రమణియన్, జస్టిస్ విక్టోరియా గౌరీల ధర్మాసనం సీబీఎఫ్సీ, లైకా ప్రొడక్షన్స్ కు నోటీసులు జారీ చేసింది. సినిమాపై మధ్యంతర నిషేధం విధించాలన్న విన్నపాన్ని మాత్రం తోసిపుచ్చింది. సీబీఎఫ్సీ, లైకా ప్రొడక్షన్స్ స్పందనను బట్టి తదుపరి విచారణ ఉండునున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు
కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు