03 October 2024
అర్దరాత్రి రితేష్ అలా మెసేజ్ చేయడంతో పిచ్చిదాన్నయ్యాను.. జెనీలియా..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్ జెనీలియా. ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా కనిపిస్తూ వెండితెరపై మాయ చేసింది ఈ బ్యూటీ.
తెలుగు, హిందీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఓ న్యూస్ షేర్ చేసుకుంది.
బాలీవుడ్ నటుడు రితేశ్‌తో ప్రేమలో ఉన్నప్పుడు ఒకసారి తాను అనుభవించిచన బాధను పంచుకుంది. రితేశ్ ఆటపట్టించాడని తెలిపింది.
ఒకరోజు అర్దరాత్రి ఒంటిగంటకు ఇంతటితో ఆపేద్దాం, ఇక బ్రేకప్ అంటూ మెసేజ్ పెట్టి పడుకున్నాడని.. అది నెక్ట్స్ డే మార్నింగ్ చేశానని..
దీంతో తనకేం అర్థం కాలేదని.. అసలెందుకిలా మెసేజ్ చేశాడని చాలా ఒత్తిడికి గురయ్యానని.. రాత్రంతా నిద్రపట్టలేదని తెలిపింది.
మరుసటి రోజు ఉదయాన్నే కాల్ చేసి ఏం చేస్తున్నావ్ అంటూ చాలా సాధారణంగా మాట్లాడడని.. దీంతో తాను కోప్పడ్డానని చెప్పుకొచ్చింది.
ఆ బాధలో ఇకపై మనం మాట్లాడుకోకూడదు. నేను నీతో మాట్లాడను అని చెప్పానని.. అందుకు ఏమి తెలియనట్లు మాట్లాడడని తెలిపింది.
రితేశ్‌కు మహిళలంటే చాలా గౌరవం.. తనను ఎంతో బాగా చూసుకుంటాడని, షూటింగ్ కోసం వెళ్తే తాను పిల్లలు చూసుకుంటాడని తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి.