RRR Movie: భ్రమరాంబ థియేటర్‌లో రాజమౌళి, చెర్రీల సహా ఫ్యామిలీల సందడి.. మూవీకోసం క్యూ కట్టిన సెలబ్రెటీలు

RRR Movie: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా నామస్మరణే. రామ్ చరణ్( Ram Charan), ఎన్టీఆర్ (NTR) కలిసి మల్టీ స్టారర్ సినిమాగా రాజమౌళి తెరకెక్కించిన..

RRR Movie: భ్రమరాంబ థియేటర్‌లో రాజమౌళి, చెర్రీల సహా ఫ్యామిలీల సందడి.. మూవీకోసం క్యూ కట్టిన సెలబ్రెటీలు
Kukat Palli Bramaramba Rrr

Updated on: Mar 25, 2022 | 10:36 AM

RRR Movie: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా నామస్మరణే. రామ్ చరణ్( Ram Charan), ఎన్టీఆర్ (NTR) కలిసి మల్టీ స్టారర్ సినిమాగా రాజమౌళి తెరకెక్కించిన సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కింది. దక్షిణాది మెగా మల్టీస్టారర్ సినిమా దేశ వ్యాప్తంగా రిలీజై సందడి చేస్తుంది. ఈ సినిమా ఇప్పటికే పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఎక్కడ చూసినా ఎవరి నోటా విన్నా ఆర్ఆర్ఆర్ సినిమా గురించే. గత రాత్రి ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి ఆర్ఆర్ఆర్ చూసిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు రామ్ చరణ్, రాజమౌళిలు భ్రమరాంబ థియేటర్లో మెగా ఫ్యామిలీ, అభిమానులతో కలిసి సినిమా చూశారు. ఈ బెనిఫిట్ షో తెల్లవారు జామున మూడు గంటలకి ప్రదర్శించారు.

రాజమౌళి, రామ్ చరణ్ లు థియేటర్ కి బెనిఫిట్ షోకి రావడంతో అభిమానులు ఈలలు, అరుపులతో హంగామా చేశారు. రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, మరికొంతమంది మెగా ఫ్యామిలీలు కలిసి ఈ బెనిఫిట్ షో చూశారు. అంతేకాదు దిల్ రాజు, ప్రభాకర్, వెన్నెల కిషోర్, రఘుబాబు వంటి  చాలా మంది సెలబ్రిటీలు కూడా బెనిఫిట్ షో చూశారు. బెనిఫిట్ షో లో రామ్ భార్య సామాన్యుల అభిమానిలా మారి సందడి చేశారు. పేపర్స్ చింపి.. వాటిని స్క్రీన్ పై చల్లుతూ.. బాల్యాన్ని మళ్ళీ గుర్తు చేసుకున్నారు. కొద్దీ సేపటి క్రితం ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షో కంప్లీట్ అయింది. థియేటర్ నుంచి రాజమౌళి, రామ్ చరణ్, మిగిలిన కుటుంబ సభ్యులు అభిమానుల కేరింతల మధ్య అతి కష్టంగా బాడీగార్డులు సహాయంతో బయటకు వచ్చారు.  చాలా మంది అభిమానులు బెనిఫిట్ షో టికెట్ల కోసం వేలల్లో ఖర్చుపెట్టి మరీ సినిమా చూస్తున్నారు.

బొమ్మ అదిరింది అంటూ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తారక్, చెర్రీ నటన అదిరిపోయిందంటూ .. రాజమౌళి టేకింగ్ అద్భుతం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: KRK on RRR: ఆర్ఆర్ఆర్‌ మూవీపై వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్.ఖాన్ సంచలన కామెంట్స్

RRR-NTR: మహేష్ థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షోని ఫ్యామిలీతో కలిసి చూసిన ఎన్టీఆర్.. విక్టరీ సొంతం అంటున్న తారక్

Follow Us